లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

16 Jun, 2017 09:38 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.  ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే సెన్సెక్స్‌ 80, నిఫ్టీ 40 పాయింట్లు లాభపడింది. ముఖ్యంగా నిఫ్టీ 9600 స్తాయి వద్ద స్థిరంగా కనిపిస్తోంది.  సెన్సెక్స్‌ 74 పాయింట్లు పెరిగి 31,150 వద్ద, నిఫ్ట  సైతం 25 పాయింట్లు 9,603వద్ద ఉంది.   ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఆటో, ఫార్మా, మెటల్‌, బ్యాంకింగ్‌ సెక్టార్‌ ,ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ టాప్‌ గెయినర్‌గా ఉంది.   అరబిందో, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, ఐటీసీ,  ఎస్‌బీఐ,  పీఎన్‌బీ, బీఓబీ, విజయ,  ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ , గెయిల్‌, టాటా స్టీల్‌ లాభపడుతున్నాయి.  దాదాపు 12 శాతం కుదేలై  ఇప్కాలాబ్స్‌ టాప్‌ సెల్లర్‌గా  ఉండగా, సిప్లా,  బీహెచ్‌ఎల్‌ , ఆర్‌ఐఎల్‌, ఏషియన్ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌, ఏసీసీ, అంబుజా తదితరాలు  నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు