నష్టాలకు చెక్‌, భారీ లాభాల ముగింపు

19 Feb, 2020 15:17 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో  ముగిసాయి. నాలుగు వరుస నష్టాలకు చెక్‌ చెప్పిన సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన స్థిరంగా ముగిసాయి.  ఆరంభ లాభాలనుంచి మధ్యలో 150 పాయింట్ల మేర వెనక్కు తగ్గినా తిరిగి మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 438 పాయింట్లు ఎగిసి 41323 వద్ద, నిఫ్టీ 133  పాయింట్లు లాభపడి 12125 ముగిసింది.  తద్వారా ఆటో సూచిక మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు పటిష్టంగా  ముగిసాయి. తద్వారా సెన్సెక్స్‌ 41300, నిఫ్టీ 12120 స్థాయిని సులుభంగా క్రాస్‌ చేసాయి.  రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌, అరబిందో ఫార్మా, ఐటీసీ, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిం, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ  భారీగా లాఢభపడ్డాయి. వోక్‌హార్డ్,  జూబిలెంట్ ఫార్మా, ఇప్కా ల్యాబ్‌ గణనీయ లాభాలను సాధించాయి. దీనికి తోడు అద్భుతమైన ఫలితాలతో ముత్తూట్‌ ఫైనాన్స్‌  భారీగా లాభపడింది. మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంక్ ,మారుతి, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మ, భారతి ఎయిర్‌ ట్‌ల్‌,టీసీఎస్‌,  నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు