స్టాక్‌మార్కెట్లకు సెలవు

30 Sep, 2017 13:41 IST|Sakshi


సాక్షి, ముంబై:  స్టాక్‌మార్కెట్లకు వరుసగా మూడు రోజులు సెలవులొచ్చాయి.  ఈక్విటీ మార్కెట్లకు శని, ఆదివారాలు సెలవు దినాలు.  అలాగే అక్టోబర్‌ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం  సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు.  దీంతో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్ఈలో   ట్రేడింగ్‌ ఉండదు.  తిరిగి మంగళవారం(3న) యథాప్రకారం ఉదయం 9.15కు మార్కెట్లు ప్రారంభమవుతాయి.

సెప్టెంబర్‌ ఎఫ్‌ అండ్‌ వో సిరీస్‌ భారీగా నష్టపోగా , ముగింపు సందర్భంగా  గురువారం చివర్లో మార్కెట్లు కోలుకున్నాయి.  అయితే అక్టోబర్‌ సిరీస్‌ ప్రారంభం రోజు (శుక్రవారం)న మార్కెట్లు ఎక్కడివక్కడే అన్నట్లుగా ముగిశాయి.

ఎఫ్‌అండ్‌వో ముగింపు నేపథ్యంలో గురువారం స్టాక్‌ మార్కెట్లలో ఏకంగా రూ. 15 లక్షల కోట్ల టర్నోవర్‌ నమోదుకాగా,  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గురువారం నగదు విభాగంలో రూ. 5,328 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు.   అలాగే  దేశీ ఫండ్స్ (డీఐఐలు) గురువారం ఏకంగా రూ. 5,196 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.

 సాక్షి  వెబ్‌  పాఠకులకు  విజయదశమి శుభాకాంక్షలు! 

మరిన్ని వార్తలు