బుల్‌ రన్‌ : రెండో రోజూ రికార్డులే

28 Aug, 2018 10:33 IST|Sakshi


సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండోరోజు కూడా రికార్డుల మోత  మోగించాయి. ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పంద సమీక్షలో భాగంగా మెక్సికోతో సరికొత్త ఒప్పందాన్ని అమెరికా కుదుర్చుకోవడం దేశీయంగా కూడా  ఇన్వెస్టర్లలో నమ్మకాన్నిచ్చింది.  దీంతో సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే డబుల్‌ సెంచరీ లాభాలను సాధించింది.  204 పాయింట్లు  ఎగిసి 38,898వద్ద,  నిఫ్టీ  65 పాయింట్లు  పుంజుకుని 11,757ను తాకింది.  దీంతో  మరోసారి కీలక సూచీలు సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 140పాయింట్లు పుంజుకుని 38,834వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 11,734 వద్ద కొనసాగుతున్నాయి

దాదాపు అన్నిరంగాలూ లాభపడ్డాయి. మెటల్‌, ఫార్మా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, బ్యాంక్‌ నిఫ్టీలాభాల మెరుపులు మెరిపిస్తున్నాయి. ఆర్‌ఐఎల్‌, ఎన్‌టీపీసీ గెయిల్‌, సిప్లా, కోల్‌ ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, హిందాల్కో, డాక్టర్‌ రెడ్డీస్‌, వేదాంతా, టాటా మోటార్స్‌  టాప్‌విన్నర్స్‌గా ఉన్నాయి. బ్లూచిప్స్‌లో టైటన్‌, యస్‌బ్యాంక్‌, హెచ్యూఎల్‌, బజాజ్‌ ఆటో  స్వల్పంగా నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు