400 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు

6 Dec, 2019 14:36 IST|Sakshi

సాక్షి, ముంబై : లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 172 పాయింట్ల లాభంతో  మొదలైన సెన్సె‍క్స్‌ ప్రస్తుతం  414 కుప్పకూలి 40365 వద్ద, నిఫ్టీ  కూడా 120 పాయింట్లు నష్టపోయి 11898 వద్ద కొనసాగుతోంది. తద్వారా నిఫ్టీ 12 వేల స్థాయిని కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల  షేర్లు  నష్ట పోతున్నాయి.  ముఖ్యంగా  బ్యాంకింగ్‌, ఆటో  సెక్టార్‌ భారీగా నష్టపోతోంది యస్‌బ్యాంకు, జీ , ఎస్‌బీఐ, గెయిల్‌, ఐషర్‌ మోటార్స్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌, ఎం అండ్‌ ఎం, మారుతి సుజుకి టాప్‌ లూజర్స్‌ గా ఉన్నాయి. మరోవైపు భారతి  ఇనఫ్రాటెల్‌, కోటక్‌ మహీంద్ర, డా. రెడ్డీస్‌,  ఏసియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, జెఎస్‌ డబ్ల్యూ స్టీల్‌, ఇన్ఫోసిస్‌ లాభపడుతున్నాయి.

>
మరిన్ని వార్తలు