ఆర్‌బీఐ బూస్ట్‌: స్థిరంగా  మార్కెట్లు

7 Feb, 2019 14:36 IST|Sakshi

 సాక్షి, ముంబై :  రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ సమావేశాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి.  వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును పావు శాతంమేర తగ్గించడంతో తొలుత మార్కెట్లు జోరందుకున్నాయి. తదుపరి కాస్త వెనకడుగు వేశాయి. తిరిగి పుంజుకుని సెన్సెక్స్‌ 109 పాయింట్ల లాభంతో 37వేలకు ఎగువన, నిప్టీ 36 పాయింట్లు ఎ గిసి 11098 వద్ద కొనసాగుతోంది. 

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తి కాంత దాస్‌  నేతృత్వంలో రెపో రేటు 6.25 శాతానికి దిగిరాగా.. రివర్స్‌ రెపో 6 శాతానికి చేరింది. అలాగు బ్యాంక్ రేటు 6.5 శాతంగా అమలుకానుంది. ఈ  నేపథ్యంలో   దాదాపు అన్ని రంగాలూ లాభపడ్డాయి.  ముఖ్యంగా బ్యాంకింగ్‌  సెక్టార్‌లో  ఇన్వెస్టర్లు కొనుళ్ల జోరందుకున్నాయి.  వీటితో పాటు ఫార్మా, ఆటో 1.6 శాతం చొప్పున ఎగశాయి. 

సన్‌ ఫార్మా 5.25 శాతం జంప్‌చేయగా, బజాజ్‌ ఆటో, ఇన్ఫ్రాటెల్‌, జీ, యస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్, టాటా మోటార్స్‌, హీరో మోటో, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్ఎం టాప్‌ విన్నర్స్‌గా నిలిచాయి.  మరోవైపు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్, గెయిల్‌, ఆర్ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో, వేదాంతా, టైటన్, ఏషియన్‌ పెయింట్స్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు