ఒడిదుడుకుల మధ్య స్టాక్‌మార్కెట్లు

31 Aug, 2017 09:31 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. స్వల్ప నష్టాలతో మొదలైన  ప్రధాన సూచీలు వెంటనే ఫ్లాట్‌ గామారాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 18 పాయింట్లు కోల్పోయి 31, 628వద్ద, నిఫ్టీ  నష్టంతో వద్ద కొనసాగుతున్నాయి.  బ్యాంకుషేర్లు నష్టాలతో బ్యాంక్‌ నిఫ్టీ నష్టాలతో ప్రారంభమైంది. మార్కెట్‌లో  ఒడిదుడుకుల వాతావరణం నెలకొంది.  రిలయన్స్‌ డిఫెన్స్‌ 5శాతానికి పైగా లాభపడి టాప్‌లో ఉంది.  ఉజ్జీవన్‌ 3శాతం లాభాలతో, బీఈఎంఎల్‌,  రిలయన్స్‌, విప్రో, అదాని  లాభాల్లో  కొనసాగుతున్నాయి.  అగాఖాన్‌ చేతికి డీసీబీ వెడుతోందన్న వార్తలతో డీసీబీ (6శాతం)  భారీ పతనాన్ని నమోదు చేసింది.  భారతి ఎయిర్‌టెల్‌,  ఎన్‌ఫీసీ, బాష్‌, సన్‌ఫార్మా, లుపిన్‌, బయోకాన్‌, ఎంఅండ్‌ఎం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.
అటు డాలర్‌ మారకంలో  రూపాయి  0.01 నష్టాలతో రూ. 64.03 వద్ద ఉండగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో పసిడి పది గ్రా. రూ.115 క్షీణించి రూ. 29, 547 వద్ద ఉంది


 

మరిన్ని వార్తలు