ఐదు స్టార్టప్‌లతో మారుతి జత

14 Oct, 2019 20:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశీయ ఆటోదిగ్గజం మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) నూతన ఆవిష్కరణలకోసం కీలక నిర్ణయం  తీసుకుంది.  తన మొబిలిటీ అండ్‌ ఆటోమొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్ (మెయిల్) ప్రోగ్రాం కింద ఐదు స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు సోమవారం తెలిపింది.  ప్రధానంగా కృత్రిమ మేధస్సు పై పనిచేస్తున్న సెన్స్ గిజ్, క్సేన్, ఐడెంటిఫై, ఎన్‌మోవిల్, డాకెట్‌రన్ అనే ఐదు స్టార్టప్‌లతో జతకట్టింది. 

ఈ ఒప్పందాల ద్వారా ఆటోమొబైల్ రంగంలో వినూత్న, అత్యాధునిక సొల్యూషన్స్‌తో ముందుకు వస్తున్న స్టార్టప్‌లను గుర్తించి, ఒకచోటకు తీసుకొచ్చినట్టు తెలిపింది. మారుతి సుజుకి వాటాదారుల ప్రయోజనాలను నిలుపుకుంటూ, భారతీయ కస్టమర్ల అవసరాలకు అవసరాల కంటే ముందుగానే అభివృద్ధి చెందుతున్న కొత్త టెక్నాలజీ సేవలను అందిచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  ఎంఎస్‌ఐ ఎండి, సీఈవో కెనిచి ఆయుకావా వెల్లడించారు.  ఈ స్టార్టప్‌లతో భాగస్వామ్యం కావడం ద్వారా  ఆటోమొబైల్  సొల్యూషన్‌ కొత్త యుగంలోకి ప్రవేశించామన్నారు.  స్టార్టప్‌లతో పాటు పనిచేయడం ద్వారా పరిష్కారాల స్కేలబిలిటీని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇవి  కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయన్నారు. ప్రస్తుతానికి మారుతి సుజుకిలోని డొమైన్ నిపుణుల మార్గనిర్దేశనంపాటు, భవిష్యత్తులో దేశీయ, అంతర్జాతీయ  స్టార్టప్‌  మార్కెట్‌ నిపుణుల ద్వారా మొత్తం ఐదు స్టార్టప్‌లకు మూడు నెలల సుదీర్ఘ  యాక్సలరేషన్‌  కార్యక్రమం ఉంటుందని  చెప్పారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎయిర్‌టెల్ సెట్-టాప్ బాక్స్‌ల ధర తగ్గింపు

జియో దెబ్బ ‌: ఎగిసిన ఎయిర్‌టెల్‌

 అదానీ గ్యాస్‌తో ఫ్రెంచ్‌ దిగ్గజం డీల్‌

భారీ ఒడిదుడుకులు, స్వల్ప లాభాలు

వొడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌

ఐఆర్‌సీటీసీ బంపర్‌ లిస్టింగ్‌

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

ఆ యాప్స్‌ను తొలగించిన గూగుల్‌

ఆరోగ్యంపై ముందే మేల్కొంటేనే..

ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6 శాతమే: ప్రపంచ బ్యాంక్‌

క్యూ2 ఫలితాలే దిక్సూచి..!

వృద్ధి రేటుపై వరల్డ్‌ బ్యాంక్‌ వార్నింగ్‌

ద్రవ్య లోటుపై రఘురామ్‌ రాజన్‌ హెచ్చరిక

‘ఫేస్‌బుక్‌’లో కొత్తగా నియామకాలు

శాంసంగ్‌ మరో అదరిపోయే ఫోన్‌

ఫ్లిప్‌కార్ట్‌ దివాలీ సేల్‌ షురూ : అదిరిపోయే ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ : బడ్జెట్‌ ధరలో జియోనీ ఫోన్‌

వొడాఫోన్ ఐడియా శుభవార్త: జియోకు షాక్‌

అక్కడ వాట్సాప్‌ మాయం!

‘అప్పు’డే వద్దు!

ఎన్‌సీఎల్‌ బిల్డ్‌టెక్‌ విస్తరణ

ప్యాసింజర్‌ వాహన విక్రయాలు డౌన్‌

పోలీసు కస్టడీకి సింగ్‌ సోదరులు

పరిశ్రమలు.. కకావికలం!

ఫోర్బ్స్‌ కుబేరుడు మళ్లీ అంబానీయే

మెప్పించిన ఇన్ఫీ!

ఇన్ఫోసిస్‌ ప్రోత్సాహకర ఫలితాలు

షాకింగ్‌ : భారీగా పడిపోయిన పారిశ్రామిక ఉత్పత్తి

ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా : మళ్లీ ముఖేషే..

వారాంతంలో మార్కెట్లు సుఖాంతం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అతిథిగా కాదు.. కుటుంబ సభ్యుడిగా వచ్చా: అనిల్‌ రావిపూడి

ఈ ఫోటోలో ఉన్న సూపర్‌స్టార్ల పేర్లు తెలుసా: షారూఖ్‌

మెర్సిడెస్ బెంజ్‌తో ‘ఇస్మార్ట్‌’ హీరోయిన్‌

నో సాంగ్స్‌, నో రొమాన్స్‌.. జస్ట్‌ యాక్షన్‌

ఆ సినిమాను అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లలో చూడలేరు

కొత్త సినిమాను ప్రారంభించిన యంగ్‌ హీరో