మారుతి దూకుడు: కొత్త రికార్డ్‌

20 Dec, 2017 11:47 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి విశ్లేషకుల అంచనాలకనుగుణంగా దూసుకుపోతోంది.  తాజాగా మారుతి సుజుకి కౌంటర్‌  బుధవారం మరో ఆల్‌ టైం రికార్డ్‌ స్థాయిని టచ్‌ చేసింది. దీంతో   మార్కెట్‌ క్యాప్‌ రీత్యా టాప్‌-5 కంపెనీల్లో మారుతి  ప్లేస్‌ కొట్టేసింది.

మారుతీ సుజుకీ షేరు బీఎస్ఈలో తొలిసారి రూ. 10వేల మైలురాయిని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌) మరింత బలపడింది. రూ. 3 లక్షల కోట్లను అధిగమించింది.  ఈ ఏడాది లో 83 శాతం వృద్ధి సాధించింది. కంపెనీ ప్రధానంగా స్విఫ్ట్‌, స్విఫ్ట్‌ డిజైర్‌, ఆల్టో విక్రయాలతో దూసుకెళుతున్న  మారుతి సరికొత్త వాహనాలతో కస్టమర్ల బేస్‌ను పెంచుకుంటోంది.  వితారా బ్రెజా, ఇగ్నిస్‌, బాలెనో తదితర కొత్త మోడళ్లకు సైతం డిమాండ్‌ భారీగా ఉండడటంతో కార్ల మార్కెట్లో కంపెనీ వాటా 50 శాతానికి చేరింది. కాగా.. ప్రస్తుతం కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రీత్యా ఐదో ర్యాంకును సొంతం చేసుకుంది.

కాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  మార్కెట్‌ క్యాప్‌ రీత్యా రూ. 5.83 లక్షల కోట్లతో అగ్రస్థానం ఉన్న సంగతి విదితమే.  ఇక రూ. 4.93 లక్షల కోట్లతో టీసీఎస్‌ రెండో ర్యాంకులోనూ,  రూ. 4.88 లక్షల కోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మూడవ ర్యాంకు,  రూ. 3.22 లక్షల కోట్లతో ఐటీసీ నాలుగో స్థానంలో  నిలిచాయి.
రూ.10వేల

మరిన్ని వార్తలు