కొత్త డిజైర్‌, స్విప్ట్‌ కార్ల రీకాల్‌

25 Jul, 2018 14:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆటోదిగ్గజం మారుతి సుజుకి దేశంలో భారీ ఎత్తున కార్లను రీకాల్‌ చేస్తోంది. ఎయిర్‌ బాగ్స్‌లో లోపాల కారణంగా  కొత్త జనరేషన్‌ స్విఫ్ట్‌, డిజైర్‌ కార్లను వెనక్కి తీసుకుంటోంది.   ఈ మేరకు మారుతి ఒక  ప్రకటన విడుదల చేసింది. మే 7నుంచి జులై 5, 2018 మధ్య ఉత్పత్తి అయిన  మొత్తం 1279 కార్లను పరీక్షిస్తున్నట్టు తెలిపింది. 2018, జులై 25నుంచి  ఈ రీకాల్‌  ప్రారంభమవుతుందని ప్రకటించాంది.

మారుతి సుజుకి దేశంలో కొత్త తరం స్విఫ్ట్ ,  డిజైర్ మోడళ్ల కార్లలో లోపాలను  తనిఖీ చేయడానికి ఈ  రీకాల్  చేపట్టినట్టు కంపెనీ తెలిపింది.  566 స్విఫ్ట్ , 713 డిజైర్ కార్లను వెనక్కి  తీసుకుంటోంది.  సంబంధిత వాహన యజమానులను మారుతి సుజుకి డీలర్లు  సంప్రదించనున్నారని తెలిపింది.  వారికి ఉచితంగా  ఆయా భాగాలను ఉచితంగా   అందిస్తామని వెల్లడించింది.  అలాగే అధికారిక మారుతి సుజుకి వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని కార్ల యజమానులను కంపెనీ కోరింది.

మరిన్ని వార్తలు