మారుతీ సుజుకీ కార్లపై రూ.70వేల డిస్కౌంట్‌

6 Sep, 2018 19:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన కార్లపై డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ నెలలో తన మోడల్స్‌పై రూ.70వేల వరకు డిస్కౌంట్‌ అందించనున్నట్టు తెలిపింది. డిస్కౌంట్‌ అందించే మోడల్స్‌లో స్విఫ్ట్‌, ఎర్టిగా, డిజైర్‌లు ఉన్నాయి. ఈ ఆఫర్‌లో నగదు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్‌ చేసే కారు, ఏడేళ్ల కంటే తక్కువ వయసున్నది అవ్వాలి. ఒకవేళ ఏడేళ్ల కంటే ఎక్కువ సర్వీసున్న కార్లకు తక్కువ ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తుంది. కారు అసలు విలువ నుంచి రూ.35 వేల వరకు ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. 

ఎర్టిగా..
మారుతీ సుజుకీ ప్రకటించిన ఆఫర్‌ కింద, ఎర్టిగా పెట్రోల్‌ వేరియంట్‌ రూ.15వేల నగదు డిస్కౌంట్‌తో లభ్యమవుతుంది. డీజిల్‌ వేరియంట్‌పై రూ.20వేల డిస్కౌంట్‌ ఉంది. అదేవిధంగా సీఎన్‌జీ ట్రిమ్‌పై రూ.10వేల డిస్కౌంట్‌ లభిస్తుంది. మారుతీ సుజుకీ ఎర్టిగా పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.30వేలు, రూ.20వేల వరకు ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు కారు వాడిన ఏళ్ల ప్రకారం ఉంటుంది. డీజిల్‌ వేరియంట్‌పై ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్లు రూ.35వేలు, రూ.25వేలుగా ఉన్నాయి.  

డిజైర్‌...
మారుతీ సుజుకీ డిజైర్‌(పెట్రోల్‌) రెగ్యులర్‌ ఎడిషన్‌పై రూ.20వేల నగదు డిస్కౌంట్‌ లభిస్తుంది. స్పెషల్‌ ఎడిషన్‌పై రూ.27వేల డిస్కౌంట్‌ ప్రకటించింది. ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ రూ.20వేల వరకు ఉంది. ఒకవేళ ఏడేళ్ల కంటే ఎక్కువ వయసున్న కారు అయితే ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ రూ.10వేలకు తగ్గుతుంది. మారుతీ సుజుకి డిజైర్‌ డీజిల్‌ వేరియంట్‌పై రూ.10వేల నగదు డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ రూ.20వేల వరకు ఆఫర్‌ చేస్తుంది.

స్విఫ్ట్‌...
మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ రెగ్యులర్‌ పెట్రోల్‌ ట్రిమ్‌ వేరియంట్‌పై రూ.20వేల వరకు నగదు డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. స్పెషల్‌ ఎడిషన్‌ వేరియంట్‌పై రూ.27వేల తగ్గింపు లభిస్తుంది. ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ రూ.20వేల వరకు, ఒకవేళ కారు ఏడేళ్ల కంటే ఎక్కువ వాడి ఉంటే, డిస్కౌంట్‌ రూ.10వేలు తగ్గిపోతుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్‌(డీజిల్‌)పై రూ.10వేల నగదు డిస్కౌంట్‌ లభిస్తుంది. దాంతో పాటు రూ.25వేల వరకు ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.  

ఆల్టో/ఆల్టో కే10...
ఆల్టో పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.25వేల నగదు డిస్కౌంట్లను మారుతీ సుజుకీ ఆఫర్‌ చేస్తుంది. మారుతీ సుజుకీ ఆల్టో కే10 పెట్రోల్‌ ఎంటీపై రూ.22వేల నగదు డిస్కౌంట్‌ లభ్యమవుతుంది. ఆల్టో కే10 ఏఎంటీపై రూ.27వేల నగదు డిస్కౌంట్‌ను, అన్ని మోడల్స్‌పై రూ.30వేల ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. 

మరిన్ని వార్తలు