స్మార్ట్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ ‘బాలెనో’ 

23 Apr, 2019 00:40 IST|Sakshi

ధరల శ్రేణి రూ.5.58 లక్షల  నుంచి రూ.8.9 లక్షలు

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ‘బాలెనో’ కారు నూతన వేరియంట్లను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బీఎస్‌ సిక్స్‌ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన పెట్రోల్‌ ఇంజిన్‌ కారు ధరల శ్రేణి రూ.5.58 లక్షల నుంచి రూ.8.9 లక్షలుగా ప్రకటించింది. వీటితో పాటు స్మార్ట్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీతో మరో రెండు అధునాతన వేరియంట్లను కంపెనీ విడుదలచేసింది. 1.2 లీటర్ల డ్యుయల్‌ జెట్, డ్యుయల్‌ వీవీటీ పెట్రోల్‌ ఇంజిన్‌ ధర రూ.7.25 లక్షలు కాగా, జీటా వేరియంట్‌ ధర రూ.7.86 లక్షలు. ఈ కార్లు లీటరుకు 23.87 కిలో మీటర్ల మైలేజీ ఇస్తాయని సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంఎస్‌ఐ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) ఆర్‌.ఎస్‌.కల్సి మాట్లాడుతూ.. ‘అధునాతన, మెరుగైన, పర్యావరణ స్నేహపూర్వక సాంకేతికత కలిగిన ఉత్పత్తులను అందించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే బీఎస్‌ సిక్స్‌ ఉద్గార నిబంధనలకు తగిన, స్మార్ట్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ బాలెనోను విడుదలచేశాం. దేశంలోనే తొలి ఈ తరహా టెక్నాలజీ కలిగిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కారు ఇది. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు తగిన విధంగా ఉందని భావిస్తున్నాం’ అని అన్నారు. ఇక బాలెనో మోడల్‌ 2015లో విడుదల కాగా, ఇప్పటివరకు 5.5 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే 2 లక్షల యూనిట్లను విక్రయించింది.

అగ్రస్థానంలో ‘ఆల్టో’ 
ఇప్పటికే అనేక సార్లు బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌గా నిలిచిన మారుతీ ‘ఆల్టో’..  2018–19  ఏడాది ప్యాసింజర్‌ వెహికిల్‌ అమ్మకాల జాబితాలో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆటోమొబైల్స్‌ తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ గణాంకాల ప్రకారం.. గతేడాదిలో ఆల్టో వాహన విక్రయాలు 2,59,401 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది (2017–18) అమ్మకాలు 2,58,539 యూనిట్లు. ఇక టాప్‌ 10 విక్రయాల జాబితాలో 2,53,859 యూనిట్లతో డిజైర్‌ రెండో స్థానంలో నిలిచింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ స్విఫ్ట్‌ 2,23,924 యూనిట్లతో మూడవ స్థానంలో ఉండగా.. బాలెనో 2,12,330 యూనిట్లతో 4వ స్థానంలో ఉంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

సుజుకి జిక్సెర్‌ కొత్త బైక్‌..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది