మారుతి సుజుకి వరుసగా ఏడోసారి ఉత్పత్తి కోత

2 Sep, 2019 18:58 IST|Sakshi

సాక్షి, ముంబై :  డిమాండ్ క్షీణించి , అమ్మకాలు లేక విలవిల్లాడుతున్న దేశీయ అతిపెద్ద కార్ల తయారీ  మారుతి సుజుకి ఇండియాకు వరుస షాక్‌లు తప్పడం లేదు. తీవ్ర మందగమనంలో ఉన్న మారుతి సుజుకి వరుసగా 7వ నెలలో కూడా ఉత్పత్తిని నిలిపివేసినట్టు ప్రకటించింది. ఆగస్టులో మాసంలో ఉత్పత్తిని 33.99 శాతం తగ్గించగా, గత నెలలో మొత్తం అమ్మకాలు 33 శాతం క్షీణించాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2018 ఆగస్టులోని 1,58,189 యూనిట్లతో పోలిస్తే 1,06,413 యూనిట్ల విక్రయాలు మాత్రమే నమోదయ్యాయని తెలిపింది. 

ఆగస్టులో కంపెనీ మొత్తం 1,11,370 యూనిట్లను ఉత్పత్తి చేయగా, అంతకుముందు నెలలో 1,68,725 యూనిట్లు ఉత్పత్తి చేశామని మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) సెప్టెంబర్ 2 న   బీఎస్‌సీ ఫైలింగ్‌లో తెలిపింది.  గత నెలలో ప్రయాణీకుల వాహనాల ఉత్పత్తి 1,10,214 యూనిట్లు కాగా, 2018 ఆగస్టులో 1,66,161 యూనిట్లగా ఉంది. అంటే   33.67 శాతం క్షీణత. ఆల్టో, న్యూ వాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో,  డిజైర్లతో సహా మినీ,  కాంపాక్ట్ సెగ్మెంట్ కార్ల ఉత్పత్తి 80,909 యూనిట్లు కాగా, గత ఏడాది ఆగస్టులో 1,22,824 యూనిట్లు మాత్రమే.  34.1 శాతం తగ్గింది. విటారా బ్రెజ్జా, ఎర్టిగా, లాంటి యుటిలిటీ వాహనాల ఉత్పత్తి 34.85 శాతం క్షీణించి 15,099 యూనిట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది 23,176 యూనిట్లు. మిడ్‌సైజ్‌ సెడాన్ సియాజ్  ఉత్పత్తి ఆగస్టులో 2,285 యూనిట్లకు తగ్గింది, గత ఏడాది ఇదే నెలలో 6,149 యూనిట్లు.

మరిన్ని వార్తలు