మారుతి కూడా ధరలు పెంచేసింది

5 Dec, 2018 14:44 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వినియోగదారులకు చేదువార్త అందించింది. మారుతి  అన్నిమోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు  బుధవారం వెల్లడించింది. వచ్చే నెలనుంచి  (2019,జనవరి) ఈ పెరిగిన ధరలు అమలవుతాయని తెలిపింది. అయితే  ఏ మేరకు పెంపు  ఉంటుంది అనేది స్పష్టం చేయలేదు. 

ఉత్పత్తి ఖర్చులు, కమోడిటీ ధరలు, రూపాయి విలువ తదితర కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కంపెనీ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రస్తుతం మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ ఆల్టో 800 నుంచి ప్రారంభమై ప్రీమియం క్రాస్ ఓవర్ ఎస్-క్రాస్కు 2.53 లక్షల రూపాయల నుంచి 11.45 లక్షల రూపాయల  మధ్య విక్రయిస్తోంది.

కాగా జపాన్‌కు చెందిన ఇసుజు మోటార్స్‌ కంపెనీ భారత్‌లో విక్రయించే తన వాహనాల ధరలను రూ.లక్ష వరకూ పెంచేసింది. పెంచిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని ఇసుజు మోటార్స్‌ తెలియజేసింది. ఉత్పత్తి, పంపిణి వ్యయాలు పెరిగిపోవడంతో ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొన్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు