క్షీణించిన మారుతి  విక్రయాలు

1 Jun, 2019 17:08 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ  అతిపెద్ద కారు మేకర్ మారుతి సుజుకి మే నెల అమ్మకాల్లో చతికిల బడింది. అమ్మకాలు 22 శాతం క్షీణించి 1,34,641 యూనిట్లు విక్రయించింది. ఈ మేరకు శనివారం గణాంకాలను మారుతి విడుదల చేసింది. మే నెలలో 1,72,512 యూనిట్లు విక్రయించినట్లు మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) ఒక ప్రకటనలో తెలిపింది.

దేశీయ అమ్మకాలు 23.1 శాతం క్షీణించి 1,25,552 యూనిట్లు విక్రయించగా .. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 1,63,200 యూనిట్లు విక్రయించింది. ఆల్టో, వ్యాగన్ ఆర్‌ లతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 16,394 యూనిట్లుగా నమోదయ్యాయి. మే నెలలో 37,864 యూనిట్లు విక్రయించగా, ఇవి 56.7 శాతం తగ్గాయి. కాంపాక్ట్ సెగ్మెంట్ అమ్మకాలు, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్లతో సహా 9.2 శాతం క్షీణించి 77,263 యూనిట్ల నుంచి 70,135 గా ఉన్నాయి.  మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ 3,592 యూనిట్లు విక్రయించింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 4,024 యూనిట్లను విక్రయించింది. విటారా  బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగాతో సహా వినియోగ వాహనాల అమ్మకాలు 25.3 శాతం తగ్గి 19,152 కి చేరుకున్నాయి. అంతకు ముందు నెల 25,629 యూనిట్లు విక్రయించింది.

ఎగుమతులు మే నెలలో 2.4 శాతం తగ్గి 9,089 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 9,312 యూనిట్లు ఎగుమతులు జరిగాయి.

మరిన్ని వార్తలు