మారుతి స్విఫ్ట్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ లాంచ్‌

23 Nov, 2017 13:01 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:  ప్రముఖదేశీయ కార్‌ మేకర్‌  మారుతి సుజుకి ..స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్‌ను ఇండియన్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌ను అదనపు ఫీచర్లతో స్పెషల్ ఎడిషన్‌ను అధికారికంగా లాంచ్  చేసింది. ఇది పెట్రోల్ ,  డీజల్ వెర్షన్‌లలో లభిస్తోంది. పెట్రోల్‌ వెర్షన్‌ ధర 5.45 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ), డీజిల్‌  వెర్షన్‌ ధరను రూ. 6.39 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ)గా  నిర్ణయించింది. బేస్ ఎల్-సిరీస్ మిడ్‌ వి సిరీస్‌ మధ్య తాజా ఎడిషన్‌ అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజీన్‌, 1.3 లీటర్‌ డీజిల్‌ ఇంజీన్‌తో  ఇది లభ్యంకానుంది. పెట్రోల్ ఇంజిన్ గరిష్ట శక్తి యొక్క 83బీహెచ్‌పి ,  115ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.  డీజిల్ ఇంజిన్ లో 74 బిహెచ్పి టాప్ టార్క్ , 190ఎన్‌శ్రీం టార్క్‌ ను  కలిగి ఉంటుంది. రెండు ఇంజన్లు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేసింది.  మారుతి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్‌లో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తోపాటు ఎక్స్‌ట్రా బేస్‌ స్పీకర్లు, ఫ్లోర్ మాట్స్, అల్లాయ్ వీల్స్‌ను కూడా జత చేర్చింది.

మరోవైపు  న్యూ జనరేషన్‌ మారుతి సుజుకి స్విఫ్ట్‌  కొత్త కారు 2018 లో లాంచ్‌ కానుంది.  ఇది ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో  లభ్యమయ్యే అవకాశం వున్న నేపథ్యంలో కొనుగోలుదారులు లిమిటెడ్ ఎడిషన్‌పై ఆసక్తి చూపిస్తారా లేక 2018 ఎడిషన్‌ కోసం వేచి  చూస్తారా చూడాలి.

మరిన్ని వార్తలు