భారీ సంఖ్యలో మారుతి కార్లు రీకాల్

27 May, 2016 11:24 IST|Sakshi
భారీ సంఖ్యలో మారుతి కార్లు రీకాల్

కార్ల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ  మరోసారి వేల సంఖ్యలో కార్లను వెనక్కి పిలిపిస్తోంది.   బాలెనో   పేరుతో  ప్రీమియం హ్యాచ్‌బ్యాక్  సెగ్మెంట్‌లో  దూసుకువచ్చిన మారుతి    సుమారు 75వేల  బాలెనో రీకాల్ చేయనున్నట్టు ప్రకటించింది.  కార్ల  మార్కెట్ లో  నెలకొన్న పోటీని తట్టుకునేందుకు వీలుగా  తన కార్లను వరుసగా అప్ గ్రేడ్ చేస్తూ  వస్తున్న మారుతి తాజాగా తన సరికొత్త మోడల్‌ బాలెనో 75,419 కాలర్లను వెనక్కి రప్పించనుంది. 

2015 ఆగస్టు 3 నుంచి 2016 మే 17 వరకు తయారుచేసిన పెట్రోల్‌, డీజిల్‌ రెండు వెర్షన్ల కార్లను వెనక్కి పిలుస్తున్నట్లు సుజుకి ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ సమయంలో తయారుచేసిన 16వేల డీజిల్‌ బాలెనో కార్లలో ఫ్యుయల్‌ ఫిల్టర్‌ కూడా సరిచేయనున్నట్లు తెలిపింది. ఫ్యుయల్‌ ఫిల్టర్‌ మార్చడానికి 1961 డిజైర్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ కార్లను కూడా వెనక్కి పిలుస్తున్నట్లు వెల్లడించింది. వెనక్కి పిలిచే కార్లకు సంబంధించి కంపెనీనే కస్టమర్లను మే 31 నుంచి సంప్రదిస్తుందని ప్రకటనలో తెలిపింది. ఫ్యుయల్‌ ఫిల్టర్‌ మార్చడం, సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ ఉచితంగానే చేస్తామని తెలిపింది. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో  మారుతి సుజుకి షేర్లు స్వల్ప నష్టాలతో  ట్రేడవుతోంది. 0.5 శాతం నష్టాలను నమోదు చేసింది.

కాగా   ఇటీవల మారుతి  తన వివిధ మోడళ్ల కార్లను వెనక్కి పిలిపించింది. అటు ఆల్టో 800  కార్లలో  ఎయిర్ బ్యాగ్ సౌకర్యాన్ని కల్పించి సరికొత్తగా ముస్తాబు చేసి అందుబాటు ధరల్లో   విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు