మారుతి విటారా బ్రెజ్జా సరికొత్తగా 

6 Feb, 2020 13:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఆటో ఎక్స్‌పో 2020 లోకొత్త విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీని మారుతి సుజుకి లాంచ్‌ చేసింది.  దేశంలో అమలు కానున్న ఉద్గార నిబంధనలు నేపథ్యంలో బీఎస్‌-6 1.5 లీటర్ కె-సిరీస్ పెట్రోల్‌ ఇంజీన్‌తో గురువారం ఆవిష్కరించింది. సరికొత్త వెర్షన్‌లో ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను అందిస్తుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీలలో విటారా బ్రెజ్జా ఉన్నతంగా నిలిచిందని మారుతి సుజుకి ఇండియా సీఎండీ కెనిచి ఆయుకావా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ, ప్రీమియంలో వస్తున్న ఆదరణకు తగినట్టుగా, విటారా బ్రెజ్జా మరింత స్పోర్టియర్‌గా మరింత శక్తివంతంగా ఉంటుందని తెలిపారు. కస్టమర్ల నుంచి భారీ స్పందనను ఆశిస్తున్నట్టు తెలిపారు.

విటారా బ్రెజ్జా 1.5 లీటర్ కె-సిరీస్ బీఎస్ 6 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 138 ఎన్‌ఎం వద్ద 4400 ఆర్‌పీయం  టాప్ ఎండ్ టార్క్‌,  పెప్పీ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  2016లో లాంచ్‌ చేసిన  విటారా బ్రెజ్జా   వాహనం  నాలుగేళ్లలో 500,000 యూనిట్లకు పైగా  అమ్ముడయ్యాయని వెల్లడించింది.

చదవండి : ఆటో ఎక్స్‌పో సందడి షురూ: కార్ల జిగేల్‌.. జిగేల్‌

అదరగొడుతున్న పియాజియో స్కూటీలు

మరిన్ని వార్తలు