వారికోసం సరికొత్త హంగులతో మారుతి

30 Aug, 2017 14:46 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భారతదేశంలోని రిటైల్ నెట్‌వర్క్‌ను రీబ్రాండింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మారుతి సుజుకి ఎరీనా అంటూ కస్టమర్లను తమ డైనమిక్‌ న్యూ వరల్డ్‌కి ఆహ్వానిస్తోంది. మారుతున్న  డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్‌ ప్రాధాన్యతల నేపథ్యంలో  తమ మోడ్రన్‌ కస్టమర్లకోసం ఈ  నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

మాస్ మార్కెట్ మోడల్స్‌ను విక్రయిస్తున్న మారుతి  షోరూంలు  ఇప్పుడు ‘మారుతి సుజుకి  ఎరీనా’ చైన్ క్రిందకి రానున్నాయి.  ప్రస్తుతం నెక్సా రిటైల్ చైన్ కింద ప్రీమియం ఉత్పత్తులను విక్రయిస్తుంస్తోంది. ఇకపై మారుతి షోరూం లను ‘మారుతి సుజుకి ఎరీనా’ పేరుతో నిర్వహించనుంది.  కంపెనీ "ట్రాన్స్‌ఫర్మేషన్ 2.0’’ లో  ఇది భాగమని మారుతి సుజుకి ఇండియా  ఒక ప్రకటన లో తెలిపింది.    ఈరీ బ్రాండింగ్‌ దశలా వారీగా ఉంటుందని, రాబోయే రెండు  మూడేళ్లలో  మొత్తం ప్రక్రియ పూర్తికానుందని మారుతి ఎండీ, డైరెక్టర్‌ ,సీఈవో కెనిచీ  అయుకవా విలేకరులతో చెప్పారు.  మార్చి, 2018 నాటికి 80 మారుతి సుజుకి ఎరానీ కేంద్రాలను  ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. భారతదేశంలో దాదాపు 75 శాతం కారు కొనుగోలుదారులు కొనుగోలుపై నిర్ణయం తీసుకోవటానికి ముందుగా ఆన్‌లైన్‌ పరిశోధన చేస్తున్నట్లు  మారుతి పేర్కొంది.

కాగా  ప్రస్తుతం, మారుతి 1,683 నగరాల్లో 2,050 షోరూమ్‌లను కలిగి ఉంది.  ప్రతి నెలలో 1.26 లక్షల వినియోగదారులతో ప్రతిరోజు తొమ్మిది కార్లను విక్రయిస్తోంది.  2020 నాటికి రెండు లక్షల కార్ల విక్రయాల లక్ష్యాన్ని చేరుకోవాలనే కంపెనీ  పథకాలు రచిస్తోంది.
 

మరిన్ని వార్తలు