మారుతీ వ్యాగన్‌ఆర్ అవాన్సె

11 Sep, 2015 01:00 IST|Sakshi
మారుతీ వ్యాగన్‌ఆర్ అవాన్సె

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ వ్యాగన్‌ఆర్‌లో లిమిటెడ్ ఎడిషన్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. అవాన్సె పేరుతో అందిస్తున్న ఈ కారు ధరలు రూ.4.30 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ తెలిపింది. మూడు నెలలు మాత్రమే విక్రయాలకు అందుబాటులో ఉండే ఈ అవాన్సెను రెండు వేరియంట్లలలో(ఎల్‌ఎక్స్‌ఐ పెట్రోల్, ఎల్‌ఎక్స్‌ఐ సీఎన్‌జీ) అందిస్తున్నామని మారుతీ సుజుకీ ఇండియా హెడ్ (మార్కెటింగ్) వినయ్ పంత్ తెలిపారు. డబుల్ డిన్ స్టీరియో విత్ బ్లూటూత్, డ్యుయల్ టోన్ డాష్‌బోర్డ్, ప్రీమియం సీట్ ఫ్యాబ్రిక్, రియర్ పవర్‌విండోస్ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. ఈ కొత్త లిమిటెడ్ వేరియంట్‌తో వ్యాగన్‌ఆర్ బ్రాండ్ మరింత శక్తివంతం అవుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు