మాస్‌ ఫైనాన్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌ లిస్టింగ్‌

18 Oct, 2017 12:46 IST|Sakshi


సాక్షి, ముంబై: గత వారం పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌   లిస్టింగ్‌లో కూడా అదరగొట్టింది. మంగళవారం  స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఎంఏఎస్‌ భారీ ప్రీమియంతో లాభాలను సాధిస్తోంది. ఇష్యూ ధర రూ.  459కాగా.. బీఎస్ఈలో రూ. 660 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఒకదశలో ఇంట్రాడేలో రూ. 668 వరకూ ఎగసింది.   ప్రస్తుతం 48 శాతం వృద్ధితో ట్రేడవుతోంది.  

ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 460 కోట్లను సమకూర్చుకుంది. అక్టోబర్ 6-10 నుంచి కంపెనీకి చెందిన 460 కోట్ల ఆరంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) 128 రెట్లు అధిగమించింది.  సంస్థాగత భాగంలో 148 సార్లు , అధిక నికర-విలువ కలిగిన సంస్థాగత వర్గీకరణ వర్గం ద్వారా 378 సార్లు, రిటైల్ పెట్టుబడిదారుల విభాగంలో 16రెట్లు  సబ్‌ స్క్రైబ్‌ అయింది.  ఇష్యూలో భాగంగా కంపెనీ యాంకర్‌ ఇన్వస్టర్ల నుంచి సైతం రూ. 136 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే.

కాగా మాస్‌ ఫైనాన్షియల్ గుజరాత్‌లో గత రెండు దశాబ్దాలకు పైగా వ్యాపార కార్యకలాపాలలను నిర్వహిస్తోంది.  ప్రధానంగా సూక్ష్మ, మధ్యతరహా సంస్థలతోపాటు మధ్య, తక్కువ ఆదాయ వర్గాలకు రుణాలను అందించడంపై దృష్టి కేంద్రీకరించింది.  టూ వీలర్‌ లోన్స్‌ రుణాలు, వాణిజ్య వాహన రుణాలు , గృహ రుణాలతో కూడిన ఐదు కేటగిరీల్లో  వీటిని అందించనుంది. తాజా ఇష్యూ ద్వారా సాధించిన  నికర ఆదాయాన్ని భవిష్యత్ అవసరాలకు, మూలధన వృద్ధికి ఉపయోగించనుంది.
 

మరిన్ని వార్తలు