మాస్టర్‌కార్డ్‌ కొత్త భద్రత ఫీచర్‌

7 Aug, 2019 10:48 IST|Sakshi

సురక్షిత ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం..

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగే దిశగా అంతర్జాతీయ పేమెంట్‌ సొల్యూషన్స్‌ దిగ్గజం మాస్టర్‌కార్డ్‌ తాజాగా కొత్త పేమెంట్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ’ఐడెంటిటీ చెక్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేరిట ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌తో చెల్లింపు ప్రక్రియ పూర్తి కావడంలో థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్‌ అవసరం ఉండదని సంస్థ వెల్లడించింది. భారత్‌లో తొలిసారిగా నిర్వహించిన గ్లోబల్‌ మాస్టర్‌కార్డ్‌ సైబర్‌సెక్యూరిటీ సదస్సులో మాస్టర్‌కార్డ్‌ దీన్ని ఆవిష్కరించింది. సాధారణంగా 20 శాతం మొబైల్‌ ఈ–కామర్స్‌ లావాదేవీలు అవాంతరాల కారణంగా విఫలమవుతున్నాయని మాస్టర్‌కార్డ్‌ సైబర్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ సొల్యూషన్స్‌ విభాగం ప్రెసిడెంట్‌ అజయ్‌ భల్లా తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజా ఫీచర్‌ను తెచ్చినట్లు వివరించారు. మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్‌ల ద్వారా జరిపే చెల్లింపులకూ ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు