భారత్ వైపు చూస్తున్న మెక్ డొనాల్డ్

18 Jun, 2016 16:44 IST|Sakshi
భారత్ వైపు చూస్తున్న మెక్ డొనాల్డ్

వాషింగ్టన్ : అమెరికాలో ఇబ్బందులు పడుతున్న ఫుడ్ సప్లయ్ జెయింట్ మెక్  డొనాల్డ్ కంపెనీ  భారత ఉద్యోగులవైపు మళ్లుతున్నట్టు తెలుస్తోంది.  అమెరికా కేంద్రంగా నడుస్తున్న ఈ  ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్..500 మిలియన్ల డాలర్ల కాస్ట్ కటింగ్ లో భాగంగా  ఇండియానుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం చూస్తున్నట్టు  న్యూయార్క్  పోస్ట్ నివేదించింది.  సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ ఈస్టర్ బూక్ నేతృత్వంలో 500 మిలియన్ డాలర్ల   కాస్ట్ కటింగ్ పేరుతో  ఉద్యోగులను తొలగించబోతుందని పేర్కొంది. 2015లో  అమెరికాలో 400 మంది  ఉద్యోగులను తొలగించిన మెక్డొనాల్డ్  అభివృద్ధి  స్తంభించిందని తెలిపింది. ఇప్పటికే వివిధ రకాలుగా భారత్ మార్కెట్ లోకి ఎంటరైనా  సంస్థ అక్కడి ఉద్యోగులకోసం చూస్తోందని పేర్కొంది.
అయితే అకౌంటింగ్ ఫంక్షన్  సహా తమ  వ్యాపారాన్ని అనేక కోణాల్లో   శాశ్వత ప్రాతిపదికన పునర్నిర్మించుకునే క్రమంలోనే ఈ చర్యలని సంస్థ ప్రతినిధి టెర్రీ హికీ చెప్పారు.  2017లో తమ వ్యాపారాన్ని విస్తరించుకునే పనిలో ఉన్నామన్నారు. అలాగే ఖర్చును తగ్గించుకోనున్నామని  సంస్థ వెల్లడించింది. అయితే  మెక్ డొనాల్డ్ అమెరికాలో  ఉన్న  ప్రాంతీయ ఆఫీసులను క్రమేపీ తగ్గించుకుంటూ వస్తోంది. గతంలో 40 గా ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 25కి చేరడం  విశేషం.

కాగా  కనీస వేతన చట్టాన్ని అమలుచేయాలని, జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ గతంలో   ఉద్యోగులు భారీ ఆందోళన చేపట్టారు. తమకు చాలీ చాలని జీతాలు ఇస్తూ.. ఉద్యోగులను సంస్థ వేధిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే.



 

మరిన్ని వార్తలు