మెర్సిడెస్‌.. బీఎస్‌–6 ‘ఎస్‌ క్లాస్‌’

20 Jan, 2018 00:03 IST|Sakshi

ముంబై: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మెర్సిడెస్‌ బెంజ్‌’ తాజాగా బీఎస్‌–6 నిబంధనలకు అనువుగా ఉన్న ‘ఎస్‌ క్లాస్‌’ కారును మార్కెట్లో ఆవిష్కరించింది. కంపెనీ దీన్ని దేశీయంగా పుణే తయారీ కేంద్రంలో తయారు చేసింది. కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్‌ నాటికి బీఎస్‌–6 నిబంధనలను అమల్లోకి తేనుంది.

అంటే దాదాపు రెండేళ్ల ముందుగానే కంపెనీ బీఎస్‌–6 నిబంధనలకు అనువైన కారును రూపొందించడం విశేషం. ఎస్‌ క్లాస్‌ డీజిల్‌ సెడాన్‌ కారును రానున్న ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శిస్తామని, దీని ధరను, ఎప్పుడు వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకువచ్చేది త్వరలో ప్రకటిస్తామని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రొనాల్డ్‌ ఫోల్గర్‌ తెలిపారు.

దేశీ తొలి బీఎస్‌–6 వాహనాన్ని తామే రూపొందించామని చెప్పారాయన. కంపెనీ మరొకవైపు ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి సెంట్రల్‌ మోటార్‌ వెహికల్‌ రూల్‌కు సంబంధించిన కాంప్లియెన్స్‌ సర్టిఫికేట్‌ను అందుకుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు