స్పెషల్ బెంజ్ కార్లొచ్చాయ్

14 Jun, 2016 14:01 IST|Sakshi
స్పెషల్ బెంజ్ కార్లొచ్చాయ్

ఫ్రాన్స్ లో జరగబోయే 2016 యూఈఎఫ్ఏ యూరో చాంపియన్ షిప్ సందర్భంగా జపాన్ కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ స్పెషల్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.  ప్రముఖ ఏ-క్లాస్,జీఎల్ఏ, సీఎల్ఏ మోడల్స్ స్పెషల్ వేరియంట్లను జపాన్ ఫుట్ బాల్ టీమ్ సపోర్టుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కేవలం పరిమితి సంఖ్యలోనే ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్స్ ను 2016 జూలై 10వరకు మెర్సిడెస్ విక్రయించనుంది.

ఏ-క్లాస్ కు చెందిన స్మాల్ కార్లు ఏ180 లాంటివి ప్రారంభ ధర రూ.25.95లక్షల గా ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఏ200డీ ధర రూ.26.95లక్షలకు పెరుగుతుందని తెలిపింది. అలాగే సీఎల్ఏ క్లాస్ సెడాన్స్ లో కొత్త సీఎల్ఏ 200ను రూ.33.4లక్షలకు, సీఎల్ఏ200డీను 34.25లక్షలకు అందుబాటులో ఉంచుతున్నట్టు మెర్సిడెస్ ప్రకటించింది.

ఏ-క్లాస్, సీఎల్ఏ, జీఎల్ఏ ప్రత్యేక ఎడిషన్ కార్లు యూఈఎఫ్ఏ యూరో 2016 ను ఇండియాలో కూడా జరుపుకుంటాయని, ఈ కొత్త తరం కార్లను డైనమిజమ్, స్పోర్టినెస్ తో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రోనాల్డ్ ఫోల్గర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే నేషనల్ రాజధాని ప్రాంతాల్లో ఎక్కువ సామర్థ్యమున్న డీజిల్ కార్లపై నిషేధం విధించడంతో, ఈ జర్మన్ కార్ల తయారీదారి భారత్ లో కఠిన పరిస్థితులనే ఎదుర్కొంటోంది.
 

మరిన్ని వార్తలు