మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్‌ కార్లు

20 Jun, 2018 13:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్ లగ్జరీ కార్ల తయారీదారు భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల విధానం పై దృష్టి  సారించింది. ఈ మేరకు  మేకిన్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ కార్లను ప్రవేశపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పుణేలో ఒక ఇ-వాహన తయారీ  కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో రోజుకు రోజుకు విస్తరిస్తున్న కాలుష్యం నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ కార్లకు డిమాండ్‌ బాగా పుంజుకోనుందని కంపెనీ భావిస్తోంది. 

ఇ-వాహనాల మార్కెట్లో  భారతీయ మార్కెట్‌ చాలా  కీలకం కానుందని భావిస్తున్న బెంజ్‌  ఈ నిర్ణయం తీసుకుంది. పూనేలోని చకన్లో ఈ  కర్మాగారాన్ని  నిర్మించనుంది.  అంతేకాదు  న్యూ ఎలక్ట్రిక్ సబ్ బ్రాండ్ 'ఈక్యూ' వాహనాలను  వచ్చే ఏడాది నుంచి  యొక్క ప్రపంచ అమ్మకాలు ప్రారంభించనుంది.  ఈక్యూ బ్రాండ్‌  కాన్సెప్ట్‌ కార్లను ఢిల్లీలో జరిగిన 2018  మోటార్‌ షోలో పరిచేయం చేసింది. భారత మార్కెట్ ఎలక్ట్రానిక్‌ కార్ల వైపు కదులుతున్నందున  తమ దీర్ఘకాలి ప్రణాళికలో భాగంగా   ఇక్కడ ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేయాలని  కోరుకుంటున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా  వైస్‌ ప్రెసిడెంట్‌ (అమ్మకాలు & మార్కెటింగ్) మైఖేల్ జోప్ చెప్పారు. కాగా కేంద్ర  ఈ తరహా వాహనాలకు ఇస్తున్న ప్రాధాన్యం నేపథ్యంలో  ఎమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా బెంజ్‌  ఎస్‌ 63 ఎఏంజీ కూపేను లాంచ్‌ చేసింది.  రూ. 2.55 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) సోమవారం భారతీయ మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు