ఈ ప్రకటన పోలే.. అదిరిపోలే!

26 Mar, 2016 13:17 IST|Sakshi
ఈ ప్రకటన పోలే.. అదిరిపోలే!

వ్యాపారరంగంలో ప్రకటనలకు ఉన్న ప్రాధాన్యం సాధారణమైంది కాదు. దీనికి ఎయిర్ టెల్ 4జీ ప్రకటన ఓ ఉదాహరణ. తమ రంగంలో సమీప ప్రత్యర్థులను ఢీకొంటూ లౌక్యంగా ముందుకు సాగడం కత్తిమీద సామే. ఈ నేపథ్యంలో మెర్సిడెస్ బెంజ్ ఇచ్చిన ప్రకటన అటు వ్యాపార వర్గాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది. బీయండబ్ల్యూ 100వ వార్షికోత్సవం సందర్భంగా బెంజ్ విడుదల చేసిన ఒక కూల్ ప్రకటన కంపెనీ మార్కెటింగ్ చతురతకు అద్దం పట్టింది.

లగ్జరీ కార్ల తయారీలో దిగ్గజ కంపెనీలు మెర్సిడెస్ బెంజ్,  బీయండబ్ల్యూ టాప్ పోజిషన్ కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో 100 వార్షికోత్సవం సందర్భంగా బీయండబ్ల్యూను అభినందిస్తూ..  అదే సందర్భంగా  తాము 130 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయాన్ని కూల్ గా చెప్పింది.  నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్టుగా.. మరో మాటలో  చెప్పాలంటే .. మీకంటే మేం 30 ఏళ్లు సీనియర్ బాసూ.. అని చెప్పకనే చెబుతూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలంటూ భుజం తట్టినట్టుగా ఉంది.   అదీ సంగతి.. పోలే.. అదిరిపోలే..

బీయండబ్ల్యూ ఉద్యోగులను తమ మ్యూజియం సందర్శనకు ఆహ్వానించింది మెర్సిడెస్. మార్చి 8 నుంచి 13 వరకు కల్పించిన ఈ అవకాశాన్ని ఉద్యోగులు బాగానే ఎంజాయ్ చేయడంతోపాటుగా బెంజ్ ఇచ్చిన నోరూరించే విందును ఆరగించారు. ఆటోమొబైల్ చరిత్రలో చారిత్రక,  సాంస్కృతిక నేపథ్యం, సమకాలీన వినూత్న పరిణామాల విశేషాలతో కూడిన మ్యూజియాన్ని పదేళ్ల క్రితం ప్రారంభించినట్టు  మెర్సిడెస్ బెంజ్ ప్రెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ రాల్ఫ్ గ్లాసర్ చెప్పారు. 100 ఏళ్లు పూర్తిచేసుకున్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బీయండబ్ల్యూకు అభినందనలు తెలిపామన్నారు.

మరిన్ని వార్తలు