మెర్సిడెస్‌ జీఎల్‌ఎస్‌ గ్రాండ్‌ ఎడిషన్‌

5 Apr, 2018 00:58 IST|Sakshi

ధర రూ.86.9 లక్షలు

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్‌ బెంజ్‌’ తాజాగా తన ప్రముఖ ఎస్‌యూవీ ‘జీఎల్‌ఎస్‌’లో గ్రాండ్‌ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.86.9 లక్షలు. ఇది జీఎల్‌ఎస్‌ 350డీ గ్రాండ్‌ ఎడిషన్‌ (డీజిల్‌), జీఎల్‌ఎస్‌ 400 గ్రాండ్‌ ఎడిషన్‌ (పెట్రోల్‌) అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.

వీటిల్లో 3 లీటర్‌ వీ6 ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది.  జీఎల్‌ఎస్‌ గ్రాండ్‌ ఎడిషన్‌లో 9 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్, 10 స్పోక్‌ అలాయ్‌ వీల్స్, రియర్‌ సీట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిస్టమ్, సన్‌రూఫ్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని  మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈవో రొనాల్డ్‌ ఫోల్గర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు