మెర్సిడెస్ ‘మేబాక్ ఎస్ 600 గార్డ్’

9 Mar, 2016 00:25 IST|Sakshi
మెర్సిడెస్ ‘మేబాక్ ఎస్ 600 గార్డ్’

ధర రూ.10.5 కోట్లు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ తాజాగా ‘మేబాక్ ఎస్ 600 గార్డ్’ మోడల్‌ను మంగళవారం భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.10.5 కోట్లు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). అత్యధిక బాలిస్టిక్ రక్షణ స్థాయి వీఆర్ 10 సర్టిఫికెట్ ఈ కారు సొంతం. భారత్‌లోకి మెర్సిడెస్ బెంజ్ నుంచి వస్తున్న అత్యంత ఖరీదైన కారు ఇదే. దీని బరువు 4.7 టన్నులు. కారులో 6.0 లీటర్ ట్విన్ టర్బో వీ12 ఇంజిన్, క్యాబిన్ ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్, ఆటోమేటిక్‌గా మంటలను ఆర్పే వ్యవస్థ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. కారు టాప్ స్పీడ్ గంటకు 190 కిలోమీటర్లు. ‘మేబాక్ ఎస్ 600 గార్డ్’ కారు పేలుళ్లు, కాల్పులు, రాకెట్ దాడులు వంటి తదితర ప్రమాదాలను తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది. స్పెషల్ ప్రొటెక్షన్ వెహికల్స్ విభాగంలో అధిక వాటాను సొంతం చేసుకోవడానికి ఈ మోడల్ దోహదపడుతుందని తెలిపింది. వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నాయకులు,  ప్రముఖులు ఎస్ 600 గార్డ్ కార్లను ఉపయోగించడానికి ఆసక్తి కనబరుస్తారని పేర్కొంది.

మరిన్ని వార్తలు