ఈ ఏడాదే హెచ్‌పీసీఎల్‌లో డిజిన్వెస్ట్‌మెంట్‌

6 Jun, 2017 05:44 IST|Sakshi
ఈ ఏడాదే హెచ్‌పీసీఎల్‌లో డిజిన్వెస్ట్‌మెంట్‌

ఓఎన్‌జీసీకి 51.1 శాతం వాటాల విక్రయం
విలువ సుమారు రూ. 28,770 కోట్లు


ముంబై: అంతర్జాతీయ స్థాయి చమురు దిగ్గజానికి రూపకల్పన చేసే దిశగా కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. హెచ్‌పీసీఎల్‌లో డిజిన్వెస్ట్‌మెంట్‌ని ఈ ఏడాదే పూర్తి చేయాలని యోచిస్తోంది. మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఓఎన్‌జీసీ)కి హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో (హెచ్‌పీసీఎల్‌)లో 51.1 శాతం వాటాల విక్రయ విధివిధానాలపై మరికొద్ది నెలల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హెచ్‌పీసీఎల్‌ షేరు ధర ప్రకారం ఈ వాటాల విలువ సుమారు రూ. 28,770 కోట్ల మేర ఉండనుంది. రెండు కంపెనీలను విలీనం చేయడానికి బదులుగా హెచ్‌పీసీఎల్‌ని ఓఎన్‌జీసీలో భాగమైన యూనిట్‌గా మాత్రమే ఉంచాలని కేంద్ర చమురు శాఖ భావిస్తున్నట్లు సమాచారం.

రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే కావడంతో యాజమాన్యంలో మార్పులేమీ ఉండనందున ఓపెన్‌ ఆఫర్‌ అవసరం రాకపోవచ్చని పరిశీలకులు తెలిపారు. దేశీయంగా టేకోవర్‌ నిబంధనల ప్రకారం ఏదైనా కంపెనీ మరో లిస్టెడ్‌ కంపెనీలో 25 శాతం పైగా వాటాలు కొన్న పక్షంలో సదరు టార్గెట్‌ సంస్థలో కనీసం మరో 26 శాతం వాటాలను పబ్లిక్‌ నుంచి కొనుగోలు చేసేందుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. హెచ్‌పీసీఎల్‌ దేశీయంగా మూడో అతి పెద్ద రిఫైనర్‌.  

డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యానికీ తోడ్పాటు..
చమురు ధరల హెచ్చుతగ్గులను తట్టుకోవడంతో పాటు ఆయిల్‌ కంపెనీల విలీనాల ద్వారా ప్రపంచ స్థాయి చమురు దిగ్గజాన్ని దేశీయంగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నట్లు కేంద్రం ఫిబ్రవరిలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓఎన్‌జీసీకి హెచ్‌పీసీఎల్‌లో వాటాలను విక్రయించడం ద్వారా భారీ సంస్థ ఆవిర్భావంతో పాటు ప్రభుత్వం నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం కూడా నెరవేరగలదు. గత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 46,247 కోట్లు సమీకరించిన కేంద్రం..  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 72,500 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకుంది. ఈ దిశలో 11 ప్రభుత్వ రంగ సంస్థల్లో 25 శాతం దాకా వాటా విక్రయాలు జరగనున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

నష్టాల్లో సూచీలు : బ్యాంకుల జోరు

హ్యుందాయ్‌ ‘కోనా’ ధర భారీగా తగ్గనుందా?

విప్రో లాభం 2,388 కోట్లు

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..