ఐటీ రిఫండ్‌ ఎస్‌ఎంఎస్‌లు : తాజా హెచ్చరిక

8 Aug, 2018 20:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీపన్ను చెల్లింపుదారులను  ఆకట్టుకునేందుకు ఐటీ  రిఫండ్స్‌ పేరుతో ఒక ఫేక్‌ మెసేజ్‌ ఒకటి హల్‌ చల్‌ చేస్తోందిట. ప్రజలను మోసగించేందుకు భారీ ఎత్తున ఐటీ రిఫండ్‌ వచ్చిందనే మెసేజ్‌లను సైబర్‌ నేరగాళ్లు పంపుతున్నారని, వీటిపట్ల అప్రమత్తంగా ఉంటాలంటూ సూచనలు జారీ అయ్యాయి. ఆదాయ పన్ను శాఖ పేరుతో వస్తున్న  'SMShing' మెసేజ్‌లపట్ల అప్రమత్తంగా ఉండాలని దేశంలోని ప్రధాన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CERT-In) హెచ్చరించింది.  ఇలాంటి హానికరమైన మెసేజ్‌లు ఇటీవల ప్రజలకు బాగా చేరుతున్నాయని తెలిపింది. 

ఐటీ రిఫండ్స్‌ వచ్చాయంటూ మెసేజ్‌ వస్తుంది. ఆ లింక్‌ చేస్తే.. ఒక నకిలీ పేజీ ఒకటి  ఓపెన్‌ అవుతుంది. ఐటీ రిఫండ్‌ పొందాలంటే.. బ్యాంకు వివరాలు, ఐడి, పాస్‌వర్డ్‌, ఎంటర్‌ చేయమని అడుగుతుంది. దీంతో బాధితుడి వివరాలను సైబర్‌ నేరగాళ్లు తస్కరిస్తారని పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ఈ ఫేక్‌ మెసేజ్‌లు  షేర్‌ అవుతున్న నేపథ్యంలో ఈ అలర్ట్‌ జారీ చేసింది. తద్వారా వారి ముఖ్యమైన వ్యక్తిగత వివరాలు సేకరించి అమ్మకానికి పెడుతున్నారని వివరించింది.

సోషల్‌ మీడియా ద్వారా ఎస్ఎంఎస్‌షింగ్‌(ఎస్ఎంఎస్అండ్‌ ఫిషింగ్) అనే లింకుపై ఒక వ్యక్తి క్లిక్ చేసినపుడు, వారి వ్యక్తిగత వివరాలు చో​రో అవడంతోపాటు, ఇ-ఫైలింగ్ క్రెడెన్షియల్స్‌ కూడా హ్యాక్‌ అవుతున్నాయనేది ఐటి శాఖ రికార్డుల ద్వారా గుర్తించినట్టు చెప్పారు. ఇలాంటి అనుమానాస‍్పద సందేశాలకు సమాధానాలు ఇవ్వడంగానీ, ఈమెయిల్స్‌లను, లింక్‌లు, ఓపెన్‌ చేయడంలాంటివిగానీ చేయొద్దని హెచ్చరించింది. హైపర్‌లింక్‌లపై క్లిక్‌ చేసే బ్యాంక్‌ ఖాతా, క్రెడిట్‌కార్డుకు సంబంధించిన ఇతర వివరాలేవీ ఎంటర్‌ చేయకూడదని తెలిపింది. అలాగే మొంబైల్‌ ఫోన్లు, ఇతర డివైస్‌లో యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్లను వాడాలని సూచించింది.

మరోవైపు ఈ చోరీపై ఆదాయపన్ను అధికారి స్పందిస్తూ ఎస్‌ఎంఎస్‌ ఆధారిత మోసం తమ దృష్టికి వచ్చినట్టు చెప్పారు. ఈ మోసంపై పన్నుచెల్లింపుదారులను అప్రమత్తం చేసేందుకు కెర్ట్‌ అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నట్టు తెలిపారు.ఆదాయపు పన్ను రిటర్న్స్‌ దాఖలు సీజన్‌ కావడంతో కెర్ట్‌ ఈ హెచ్చరిక చేసింది. ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డ్ (సీబీడీటీ) ఆదాయ పన్ను దాఖలు గడువును ఆగస్టు 31వరక పొడిగించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు