లాభాల మార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్‌..!

5 Jun, 2020 11:21 IST|Sakshi

నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్లలో 3మెటల్‌ షేర్లు

స్టాక్‌ మార్కెట్‌లో శుక్రవారం మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 3శాతానికి పైగా లాభపడింది. కొన్ని రోజులుగా మార్కెట్‌లో విస్తృతస్థాయి కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ.., ఈ రంగ షేర్లు ఆశించినస్థాయిలో రాణించలేకపోయాయి. అయితే నేటి మార్కెట్‌ ప్రారంభం నుంచే ఈ మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.  ఈ రంగానికి చెందిన మెయిల్‌ షేరు అత్యధికంగా 8.50శాతం లాభపడింది. ఏపిఎల్‌ అపోలో, టాటా స్టీల్‌ షేర్లు 6శాతం పెరిగాయి. సెయిల్‌, హిందాల్కో షేర్లు 5శాతం ర్యాలీ చేశాయి. జిందాల్‌ స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, హిందూస్థాన్‌ కాపర్‌ షేరు 4.50శాతం లాభపడ్డాయి. నాల్కో 3.50శాతం, ఎన్‌ఎండీసీ, కోల్‌ ఇండియా షేర్లు 2శాతం, రత్నమణి మెటల్‌ ట్యూబ్స్‌ లిమిటెడ్‌, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు 1శాతం పెరిగాయి. వెల్‌స్పన్‌ కార్ప్‌, వేదాంత షేర్లు 1.50శాతం నుంచి 1శాతం నష్టా‍న్ని చవిచూశాయి.

ఉదయం 11గంటలకు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మునుపటి ముగింపు(1,972.90)తో పోలిస్తే 3.30శాతం లాభంతో 2,037.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 షేర్లలో జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, హిందాల్కో, టాటా మోటర్స్‌ షేర్లు చోటు దక్కించుకోవడం విశేషం.

మరిన్ని వార్తలు