సెబీ చెంతకు 85 కొత్త ఫండ్‌ స్కీములు

28 Aug, 2017 00:30 IST|Sakshi
సెబీ చెంతకు 85 కొత్త ఫండ్‌ స్కీములు

మ్యూచువల్‌ ఫండ్‌ స్కీముల్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ చెంతకు ఈ ఏడాది ఇప్పటివరకూ 85 కొత్త స్కీములు పరిశీలనకు వచ్చాయి. మ్యూచువల్‌ ఫండ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు... ఈక్విటీ, డెట్, హైబ్రీడ్, ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్ల జారీకి ఈ స్కీము ప్రతిపాదనల్ని సెబీకి సమర్పించాయి. న్యూ ఫండ్‌ ఆఫర్ల(ఎన్‌ఎఫ్‌ఓలు)కోసం సెబీకి దరఖాస్తు చేసిన సంస్థల్లో మహింద్రా, యాక్సిస్, రిలయన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, బిర్లా సన్‌లైఫ్‌  హెచ్‌డీఎఫ్‌సీ, యూటీఐ, ఎడెల్‌వీజ్, ఎస్‌బీఐలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఎన్‌ఎఫ్‌ఓలు ఇప్పటికే జారీకాగా, మరికొన్ని అనుమతులు రాగానే ప్రారంభంకానున్నాయి.  

హిందీ పేర్లతో...: ఆసక్తికరమైన అంశమేమిటంటే..కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ జారీచేసే స్కీములకు హిందీ భాషలో పేర్లు పెట్టాయి. ఫండ్‌ స్కీములకు ఇప్పటివరకూ ఇంగ్లీషులోనే పేర్లు ఉంటుండగా, గ్రామీణ ప్రాంతాల ఇన్వెస్టర్లకు స్కీముల లక్ష్యాలు సులభంగా అర్థమవుతాయన్న ఉద్దేశ్యంతో హిందీ పేర్లతో స్కీముల్ని జారీచేసేందుకు ఫండ్‌ హౌస్‌లు శ్రీకారం చుట్టాయి. మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ సెబీకి సమర్పించిన స్కీములకు.. డైనమిక్‌ బాండ్‌ బచత్‌ యోజన, ప్రగతి బ్లూచిప్‌ యోజన, ఉన్నతి మిడ్‌ స్మాల్‌క్యాప్‌ యోజన వంటి పేర్లు ఉన్నాయి.  

4.8 కోట్లకు ఫండ్‌ ఇన్వెస్టర్లు....
మ్యూచువల్‌ ఫండ్‌ స్కీముల పట్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు కనపరుస్తున్న అమితాసక్తి కారణంగా కొత్త స్కీముల జారీని ఫండ్‌ హవుస్‌లు వేగవంతం చేశాయని, ఇటీవల ప్రారంభమైన స్కీములకు మంచి స్పందన లభించిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది జూలై చివరినాటికి మ్యూచువల్‌ ఫండ్‌ స్కీముల్లో పెట్టుబడి చేసిన ఇన్వెస్టర్ల సంఖ్య 4.8 కోట్లకు చేరిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!