మేలో మ్యూచువల్‌ ఫండ్లు కొన్న టాప్‌-5 లార్జ్‌ క్యాప్‌ షేర్లివే..!

15 Jun, 2020 11:45 IST|Sakshi

లిస్ట్‌లో బ్రిటానియా, భారతీ ఎయిర్‌టెల్‌

మ్యూచువల్‌ ఫండ్లు మే నెలలో లార్జ్‌క్యాప్‌ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత దేశీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకొని కంపెనీల లాభాలు తిరిగి బౌన్స్‌బ్యాక్‌ కావచ్చనే అంచనాలతో మ్యూచవల్‌ ఫండ్లలో నెలకొన్నాయి. ఇప్పుడు మ్యూచువల్‌ ఫండ్లు మేనెలలో కొనుగోలు చేసిన టాప్‌-5 కంపెనీల షేర్లను పరిశీలిద్దాం...

షేరు పేరు: బజాజ్‌ ఫైనాన్స్‌ 
మార్కెట్‌ క్యాప్‌: రూ.1,47,351 కోట్లు
మ్యూచువల్‌ ఫండ్‌: ఐసీఐసీఐ ప్రు మ్యూచువల్‌ ఫండ్‌ 
విశ్లేషణ: ఈ షేరు ఇటీవల భారీ పతనాన్ని చవిచూసి సరసమైన ధరలో ట్రేడ్‌ అవుతూ మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లను ఆకర్షిస్తోంది. బలమైన మేనేజ్‌మెంట్‌తో పాటు అధిక లిక్విడిటిని కలిగి ఉండటంతో ఈ షేరు కొనుగోలుకు మ్యూచువల్‌ ఫండ్లు మొగ్గుచూపాయి. ఏది ఏమైనా మారిటోరియం విధింపు నేపథ్యంలో కంపెనీకి స్వల్పకాలం పాటు మొండి బకాయిల సమస్య నెలకొనవచ్చు. మరో ఏడాది కాలం ‘‘వృద్ధి’’ అనే అంశం సవాలుగా మారుతుంది. 

షేరు పేరు: బ్రిటానియా ఇండస్ట్రీస్‌ 
మార్కెట్‌ క్యాప్‌: రూ. 80,972 కోట్లు
మ్యూచువల్‌ ఫండ్‌: కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌
విశ్లేషణ: బ్రిటానియా ఉత్పత్తులు అత్యవసర, గృహాల్లో వినియోగ వస్తువులుగా మారాయి. లాక్‌డౌన్‌ సమయాల్లో కూడా కంపెనీ ఉత్పత్తుల పంపిణీ, రవాణాకి ఎలాంటి అంతరాయాలు ఏర్పడలేదు. డీలర్లు, అమ్మకందారులు సజావుగా బ్రిటానియా ఉత్పత్తులను విక్రయించగలిగారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు మరింత పెరిగాయి. మే నెలలో ఈ కంపెనీ షేరు 10శాతం పెరిగింది. అయితే ఎర్నింగ్‌తో పోలిస్తే షేరు ధర 44రెట్లు అధికంగా ట్రేడ్‌ అవుతోంది. ఈ ధర వద్ద వాల్యూయేషన్లు చౌకగా లేవు. కాని ప్రస్తు‍త పరిస్థితుల్లో వ్యాల్యూయేషన్లు ప్రత్యర్థి కంపెనీల కంటే అధికంగా లేవు.


షేరు పేరు: ఏషియన్‌ పేయింట్స్‌
మార్కెట్‌ క్యాప్‌: రూ.1,57, 111 కోట్ల 
మ్యూచువల్‌ ఫండ్‌: ఆదిత్య బిర్లా మ్యూచువల్‌ ఫండ్‌ 
విశ్లేషణ: పెయింటింగ్‌ మార్కెట్లో అధిక వాటాను కలిగి ఉంది. బలమైన పంపిణీ నెట్‌వర్క్, ఉత్తమ రిటర్న్‌ నిష్పత్తులను కలిగి ఉండటంతో గత పదేళ్ల నుంచి మ్యూచువల్‌ ఫండ్లు ఈ షేర్లను కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. గడచిన మూడేళ్లలో ఈ షేరు 25శాతానికి మించి లాభాలను ఇచ్చింది. అన్నింటిని మించి కంపెనీ రుణరహితంగా ఉంది. మే తొలి అర్ధభాగంలో ఈ షేరు 9శాతం నష్టాన్ని చవిచూసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని కంపెనీలు ఉద్యోగాల కోత, తొలిగింపు చేస్తున్న సందర్భంలో తరుణంలో ఈ కంపెనీ తన ఉద్యోగులు శాలరీల పెంచుతున్నట్లు ప్రకటించింది. 


షేరు పేరు: అరబిందో ఫార్మా
మార్కెట్‌ క్యాప్‌: రూ.45,249 కోట్లు
మ్యూచువల్‌ ఫండ్‌: హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ 
విశ్లేషణ: తక్కువ ఇన్వెంటరీ వ్యయాలు, పెరిగిన ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ మార్జిన్లు, ఫార్మూలేషన్‌ వ్యాపారంలో వృద్ధి, ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే అమెరికా, యూరప్‌ మార్కెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో పాటు కంపెనీ రుణాల తగ్గింపు లాంటి సానుకూలాంశాలు మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లను ఆకర్షించాయి. 

షేరు పేరు: భారతీ ఎయిర్‌టెల్‌
మార్కెట్‌ క్యాప్‌: రూ.305,457 కోట్లు
మ్యూచువల్‌ ఫండ్‌: ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌
విశ్లేషణ: దేశీయంగా మొబైల్‌, నాన్‌-మొబైల్‌ విభాగంలో అత్యధిక మార్కెట్‌ వాటాను కలిగి ఉండటంతో పాటు ఆఫ్రికాలో వ్యాపారాల డైవర్సిఫికేషన్‌, ఆరోగ్య రంగంలోకి అడుగుపెట్టడంతో ఈ షేరు మ్యూచువల్‌ ఫండ్ల దృష్టిని ఆకర్షించింది. వర్క్‌-ఫ్రమ్‌ హోమ్‌ ట్రెండ్‌ ఏర్పడటం, ఓటీటీ మార్కెట్‌ పెరగడం కంపెనీకి కలిసొచ్చే ప్రధాన అంశాలు. పోటీలో భాగంగా కస్టమర్లు పెరిగే కొద్ది టెలికాం కంపెనీలు ధరలను పెంచుతూ ఉంటాయి. వచ్చే కొన్నేళ్లలో యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌ 10శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు