భారీ బ్యాటరీ, బడ్జెట్‌ ధర, 50జీబీ డేటా...‘భారత్‌-5’

1 Dec, 2017 15:27 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ మొబైల్‌ బ్రాండ్‌ మైక్రోమ్యాక్స్  భారీ బ్యాటరీతో ‘భారత్ 5’   పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం లాంచ్‌  చేసింది. ఈ డివైస్‌లో అతిపెద్ద హైలైట్  5000  ఎంఏహెచ్‌ బ్యాటరీ అయితే మరో  విశేషం రూ.5555 ధరకే ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేవడం. అలాగే వొడాఫోన్‌తో  భాగస్వామ్యంలో  డేటా ఆఫర్ కూడా ఉంది. దేశంలో ఆఫ్‌లైన్ రిటైలర్లు ద్వారా కొనుగోలు చేయడానికి మాత్రమే ఇది  అందుబాటులో ఉంటుంది. భారత్-సీరీస్లో భారత్ 5 ప్లస్, భారత్ 5 ప్రోతో పాటు మరో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి 2018 నాటికి 6 లక్షల యూనిట్లను విక్రయించాలని కంపెనీ భావిస్తోంది

మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్, చీఫ్ మార్కెటింగ్ అండ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ షుబోడిప్ పాల్ మాట్లాడుతూ .. భారత్‌5  సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు  స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో తరువాత దిశగా భారత్‌ను తీసుకెళతాయని,  ఈ క్రమంలో ‌ఇప్పటికీ తీవ్రమైన విద్యుత్తు అంతరాయ సమస్యలను ఎదుర్కొంటున్న దేశంలోని  3-4 టైర్‌ నగరాల్లో తమ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ డివైస్‌లు కీలకంగా నిలుస్తాయన్నారు.
 

లాంచింగ్‌ ఆఫర్‌

దేశ్‌కా స్మార్ట్‌ఫోన్‌ అంటూ లాంచ్‌ అయిన రెడ్‌మీ5ఏ కీ పోటీగా తీసుకొచ్చిన భారత్‌ 5 లాంచింగ్‌ ఆఫర్‌గా వొడాఫోన్ కస్టమర్లకు  5నెలలు 50జీబీ డేటా ఉచితంగా అందిస్తోంది.  అం‍టే 1జీబీ  డేటా  అందించే ఏదైనా  వోడాఫోన్‌ ప్యాక్‌లో కస్టమర్లకు  అదనంగా  10 జీబీ డేటాను  5నెలలపాటు ఉచితంగా అందిస్తుంది.   

మైక్రోమ్యాక్స్ భారత్ 5  ఫీచర్లు
 5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌
1.3GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ నౌగాట్‌
720x1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌
1జీబీ  ర్యామ్‌
16జీబీ స్టోరేజ్‌
64జీబీదాకా విస్తరించుకునే సదుపాయం
5 మెగాపిక్సెల్‌ బ్యాంక్‌ అండ్‌ ఫ్రంట్‌  కెమెరాలు విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

మరిన్ని వార్తలు