మైక్రోమాక్స్‌ 4జీ ఫోన్‌ అక్టోబర్‌ 20 నుంచే..ధర?

17 Oct, 2017 19:26 IST|Sakshi

సాక్షి, ముంబై: రిలయన్స్, జియో ఫీచర్ ఫోన్ల  సందడి తర్వాత తాజాగా  మైక్రోమ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌  4జీ వోల్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ ఫోన్‌ను ఈ నెల 20 వ తేదీనుంచి కసమర్లకు అందుబాటులోకి తెస్తోంది. ఇందుకు  ప్రభుత్వ రంగ సంస్థ  టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తన ఒక ఒప్పందాన్ని చేసుకున్నట్టు మైక్రోమాక్స్‌ వెల్లడించింది

ప్రభుత్వ రంగ  టెలికాం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్  భాగస్వామ్యంతో 4జీ వోల్ట్‌ ఫోన్‌ త‍్వరలో లాంచ్‌  చేయనున్నామని మంగళవారం ప్రకటించింది.  భారత్-1 పేరుతో లాంచ్‌ చేయనున్న 4జీ ఫోన్  ను  500 మిలియన్ల మంది భారతీయులకు పౌరులకు అందించే లక్ష్యంతో  ఉన్నామని మైక్రోమ్యాక్స్ ,  బిఎస్ఎన్ఎల్  తెలిపాయి. వినియోగదారులకు ఉత్తమ మొబైల్ అనుభవాన్ని , డేటా సేవలను అందించనున్నట్టు చెప్పాయి.  దేశ్‌కా 4జీ ఫోన్‌ ‘భారత్-1’ పేరుతో లాంచ్‌  చేస్తున్న ఈ ఫోన్‌ ధరను రూ.2,200గా నిర్ణయించాయి.  అంతేకాదు దేశవ్యాప్తంగా అన్ని రీటైల్‌ కౌంటర్లలో అక్టోబర్‌ 20నుంచి అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించాయి. అలాగే  నెలకు రూ .97ల రీచార్జ్‌పై అపరిమిత కాలింగ్‌, అపరిమిత డేటా సేవలను బీఎస్‌ఎన్‌ఎల్‌  అందించనుంది.

డ్యూయల్‌ సిమ్ కనెక్టివిటీతో  22 వివిధ భాషలకు మద్దతుతో ఇది అందుబాటులోకి వస్తుంది. అక్టోబరు 20 నుంచి రిటైల్ అవులెట్లలో భారతదేశం అంతటా అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది.  భారత్ -1 ఫోన్‌ తమ లక్షల మంది వినియోగదారులు డేటా  సేవల్ని అనుభవించటానికి,  ఎన్నడూ లేని విధంగా కాలింగ్ అనుభవాన్ని పొందడానికి సహాయపడుతుందని తాము విశ్వసిస్తున్నామని బిఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ, మైక్రోమ్యాక్స్  సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ చెప్పారు. భీమ్ యూపీఐ పేమెంట్స్ యాప్, బీఎస్‌ఎన్‌ఎల్ వాలెట్ యాప్స్‌ను ఇందులో ప్రీలోడెడ్‌గా అందిస్తున్నారు. 100 లైవ్ టీవీ చానల్స్‌ను వీక్షించవచ్చు. పాటలను విన‌వ‌చ్చు. వీడియోలను చూడవచ్చు.

భారత్-1 ఫోన్‌  ఫీచర్లు
2.4 అంగుళాల స్క్రీన్
క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగన్ ప్రాసెసర్ 
4 జీబీ ర్యామ్‌ 
512ఎంబీ స్టోరేజ్‌ 
2ఎంపీ  వెనుక కెమెరా
వీజీఏ సెల్ఫీ కెమెరా
2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 

మరిన్ని వార్తలు