హైదరాబాద్‌లో మైక్రాన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

5 Oct, 2019 05:07 IST|Sakshi
మైక్రాన్‌ సెంటర్‌ ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తదితరులు.

భారత్‌లో 2,000 దాకా సిబ్బంది పెంపు!

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమెరికాకు చెందిన సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్‌ టెక్నాలజీ తాజాగా హైదరాబాద్‌లో గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (జీడీసీ)ని ఆవిష్కరించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ శుక్రవారమిక్కడ దీన్ని ప్రారంభించారు. మైక్రాన్‌ వంటి దిగ్గజ సంస్థ హైదరాబాద్‌లో తమ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని ఈ సందర్భంగా కేటీఆర్‌ చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్స్‌ ఉన్నాయని, ఈ విభాగంలో పెట్టుబడులకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయన్నారు. సెమీకండక్టర్స్‌ తయారీ యూనిట్‌ను కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

మరోవైపు, సుమారు 3,50,000 చ.అ. విస్తీర్ణంలో ఈ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో సంజయ్‌ మెహ్‌రోత్రా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన బెంగళూరు కార్యాలయంతో పాటు హైదరాబాద్‌ జీడీసీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 700 దాకా ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని 2,000 దాకా పెంచుకోనున్నట్లు, ఇందులో ఎక్కువగా నియామకాలు హైదరాబాద్‌ కేంద్రంలోనే ఉండనున్నట్లు మెహ్‌రోత్రా వివరించారు. ప్రస్తుతం తమకు జపాన్, చైనా సహా ఆరు దేశాల్లో తయారీ కార్యకలాపాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. డేటా విప్లవంతో   ఈ రంగంలో అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అమితాబ్‌ కాంత్‌ చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మార్కెట్లకు జీడీపీ ‘కోత’!

పర్సంటేజ్‌లతో పండగ చేస్కో!

స్టాక్‌ మార్కెట్లకు జీడీపీ సెగ..

ఆర్‌బీఐ రేట్‌ కట్‌ : మార్కెట్ల పతనం

ఆర్‌బీఐ కీలక నిర్ణయం : రెపో రేటు కోత

ఫేస్‌బుక్‌ కొత్త యాప్‌, ‘థ్రెడ్స్‌’  చూశారా!

హ్యుందాయ్‌ కొత్త ఎలంట్రా

లెక్సస్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ@ రూ.99 లక్షలు

హ్యాపీ మొబైల్స్‌ రూ.5 కోట్ల బహుమతులు

5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ సాధ్యమే

పెట్రోల్‌ పోయించుకుంటే బహుమతులు

బీపీసీఎల్‌కు ‘డౌన్‌గ్రేడ్‌’ ముప్పు!

మారుతి నెక్సా రికార్డ్‌

ఆర్‌బీఐ బూస్ట్‌ : మార్కెట్ల లాభాల దౌడు

ఐఆర్‌సీటీసీ ఐపీఓ అదుర్స్‌!

పీఎంసీ కేసులో హెచ్‌డీఐఎల్‌ డైరెక్టర్ల అరెస్ట్‌

టాటా ‘పులి’ స్వారీ ముగుస్తుందా?

హెచ్‌డీఐఎల్‌ ఎండీ, సీఈవో అరెస్ట్‌

యస్‌ బ్యాంకునకు ఊరట : షేరు జంప్‌ 

భారీ నష్టాలు : 38 వేల దిగువకు సెన్సెక్స్‌

లలిత్‌మోదీ, ఆయన భార్యకు స్విట్జర్లాండ్‌ నోటీసులు

నేటి నుంచే రుణ మేళాలు

పైపైన ఆడిటింగ్‌.. సంక్షోభానికి కారణం

చైనాలో తయారీకి శాంసంగ్‌ గుడ్‌బై

సైబర్‌ మోసాలపై టెకీల పోరు

జొమాటో జోరు : ఆదాయం మూడు రెట్లు జంప్‌

గాంధీ జయంతి : మార్కెట్లకు సెలవు

కాగ్నిజంట్‌లో లక్ష దాటిన మహిళా ఉద్యోగుల సంఖ్య

ల్యాప్‌టాప్స్‌పై భారీ క్యాష్‌బ్యాక్‌

‘బిగ్‌సి’ డబుల్‌ ధమాకా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఫోన్‌కి అతుక్కుపోతున్నారు

కేరళ చరిత్రతో...

గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే ఇష్టం

డాటరాఫ్‌ శకుంతల

వెనక్కి వెళ్లేది లేదు

అమెరికా కాల్పులతో...