మైక్రోసాఫ్ట్, అపోలో  హాస్పిటల్స్‌ భాగస్వామ్యం

9 Mar, 2018 05:46 IST|Sakshi

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ప్రముఖ హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ అపోలో హాస్పిటల్స్‌ తాజాగా గుండె సంబంధిత వ్యాధుల్లో అధునాతన టెక్నాలజీ వినియోగానికి చేతులు కలిపాయి. కార్డియాలజీలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫోకస్డ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ఇవి కలిసి పనిచేస్తాయి.

గుండె వ్యాధులకు సంబంధించి రోగికున్న ప్రమాదాన్ని ముందే అంచనా వేయడానికి, అలాగే డాక్టర్లకు వ్యాధి ట్రీట్‌మెంట్‌కు అవసరమైన సాయమందించేందుకు కొత్త మెషీన్‌ లెర్నింగ్‌ విధానాలను ఇవి అభివృద్ధి చేస్తాయి. ఈ టెక్నాలజీలు... గుండె సంబంధిత వ్యాధులను మెరుగ్గా అంచనా వేయడానికి, నివారించడానికి దోహదపడతాయని అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ ఎండీ సంగీతా రెడ్డి పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు