నేను చేసిన పెద్ద తప్పు అదే: బిల్‌గేట్స్‌

26 Jun, 2019 11:27 IST|Sakshi

ఆండ్రాయిడ్‌కు ధీటైన ఓఎస్‌ తేలేకపోయా  

మైక్రోసాఫ్ట్‌ బిల్‌గేట్స్‌ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: ఆండ్రాయిడ్‌ను అభివృద్ధి చేసే అవకాశం గూగుల్‌కు దక్కేలా చేయడం, ఆండ్రాయిడ్‌కు ధీటైన మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తయారు చేసుకోలేకపోవడం తాను చేసిన అతి పెద్ద తప్పు అని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు. ఫలితంగా తమ కంపెనీకి 40,000 కోట్ల డాలర్ల నష్టం వచ్చిందని వివరించారు. ఆండ్రాయిడ్‌ను 5 కోట్ల డాలర్లకే ఎగరేసుకుపోయిన గూగుల్‌ నిజమైన విజేతగా నిలిచిందని పేర్కొన్నారు. వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ, విలేజ్‌ గ్లోబల్‌కు ఇచ్చిన ఒక ఇంటరŠూయ్వలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. 

అన్నీ ఆండ్రాయిడ్‌ ఫోన్లే...
యాపిల్‌ ఫోన్లు కాకుండా మిగిలిన ఇతర ఫోన్లకు ప్రామాణిక ప్లాట్‌ఫాంగా ఆండ్రాయిడ్‌ అవతరించిందని, మైక్రోసాఫ్ట్‌ ఆ స్థానంలో ఉండాల్సిందని ఆయన వివరించారు. గూగుల్‌ కంపెనీ ఆండ్రాయిడ్‌ను 2005లోనే కొనుగోలు చేసింది. ఐఫోన్‌ 2007లో మార్కెట్లోకి రాగా, ఆండ్రాయిడ్‌ ఫోన్‌2008లో మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం తయారవుతున్న స్మార్ట్‌ఫోన్లలో 85 శాతానికి పైగా ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో ఉన్నవే. ఇక విండోస్‌ ఓఎస్‌తో తయారైన ఫోన్‌లు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా