మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్‌ కన్నుమూత

16 Oct, 2018 17:44 IST|Sakshi

మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు పౌల్ అలెన్ (65) కన్నుమూశారు.  కొంతకాలంగా నాన్ హాడ్కిన్స్ లింఫోమా క్యాన్సర్ వ్యాధితో​ బాధపడుతున్నారు. 2009లో ఈ వ్యాధి బారిన పడిన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు.  కానీ మళ్లీ రెండు వారాల క్రితమే ఆ వ్యాధి  మరింత  తీవ్రం కావడంతో పౌల్‌  తుదిశ్వాస విడిచారని  ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 

మైక్రోసాఫ్ట్  వ్యస్థాపకుడు బిల్ గేట్స్, సీఈవో సత్య నాదెళ్ల , ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ సహా పలువురు టెక్‌ నిపుణులు పౌల్‌  మృతిపై ట్విటర్‌ ద్వారా సంతాపాన్ని తెలిపారు,  ముఖ్యంగా బిల్‌గేట్స్‌ తన మిత్రుడి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ప్రపంచం  ఒకగొప్ప టెక్నాలజీ మార్గదర్శకుడిని  కోల్పోయిందన్నారు. 

కాగా 1975లో బిల్ గేట్స్, పౌల్ అలెన్‌లు మైక్రోస్టాఫ్ సంస్థను స్థాపించారు. ఈ ఇద్దరూ స్కూల్ ఫ్రెండ్స్. దానగుణంలోనూ బిల్ గేట్స్‌కు సాటిగా నిలిచారు పౌల్.  మైక్రోసాఫ్ట్ సంస్థ కార్పొరేట్ స్థాయికి ఎదగడానికి ముందే, 1983లోనే గేట్స్‌తో వచ్చిన విభేదాల కారణంగాపౌల్‌  మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలగారు.

మరిన్ని వార్తలు