నోయిడాలో మైక్రోసాఫ్ట్‌ ఇంజినీరింగ్‌ హబ్‌

18 Feb, 2020 07:57 IST|Sakshi

న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌.. భారత్‌లో తన మూడవ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. నోయిడాలో ఇంజనీరింగ్, ఇన్నోవేషన్‌ హబ్‌ను సోమవారం ప్రారంభించింది. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో ఇటువంటి కేంద్రాలను ఏర్పాటుచేసిన సంస్థ.. తాజగా ‘ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఐడీసీ)–ఎన్‌సీఆర్‌’ను ఆరంభించింది. మైక్రోసాఫ్ట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), రీసెర్చ్‌ గ్రూప్, క్లౌడ్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ గ్రూప్, ఎక్స్‌పీరియన్స్‌ అండ్‌ డివైసెస్‌తో పాటు కోర్‌ సర్వీసెస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఆపరేషన్స్‌ ఇక్కడ కొనసాగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

మరిన్ని వార్తలు