మైక్రోసాఫ్ట్‌ విస్తరణ: భారీ ఉద్యోగాలు

27 Mar, 2018 01:42 IST|Sakshi

ప్రస్తుతమున్న క్యాంపస్‌ విస్తరణ

కొత్తగా 2,500 మందికి ఉద్యోగావకాశాలు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌లో గ్యారేజ్‌ని ప్రారంభించింది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), రోబోటిక్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి కొత్త సాంకేతికతలపై ఉద్యోగులు పనిచేసేందుకు, ఉత్పత్తుల పరిష్కరణ వంటి వాటి కోసం ఈ గ్యారేజీ పనిచేస్తుంది. సోమవారమిక్కడ గ్యారేజీని ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ..

‘‘ప్రస్తుతం నగరంలోని మైక్రోసాఫ్ట్‌ క్యాంపస్‌ విస్తరణ చేయనుందని.. దీంతో కొత్తగా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలొస్తాయని’’ తెలిపారు. 8 వేల చ.అ. విస్తీర్ణంలో ఉన్న ఈ గ్యారేజ్‌ దేశంలోనే మొదటిది. ఇలాంటి సెంటర్‌ మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయం అమెరికాలోని రెండ్‌మౌండ్‌లోనూ ఉంది. దేశంలో 2014 నుంచి గ్యారేజ్‌ కార్యక్రమాలున్నప్పటికీ ప్రత్యేకంగా గ్యారేజ్‌ కోసం స్థలం కేటాయించడం ఇదే తొలిసారని మైక్రోసాఫ్ట్‌ గ్యారేజ్‌ ఇండియా డైరెక్టర్‌ రీనా దయాళ్‌ తెలిపారు.


 

మరిన్ని వార్తలు