కృత్రిమ మేధ ఎఫెక్ట్‌: జర్నలిస్టుల తొలగింపు

1 Jun, 2020 19:19 IST|Sakshi

ముంబై: సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ జర్నలిస్టుల తొలగింపునకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు గార్డియన్‌ నివేదిక తెలిపింది. మైక్రోసాఫ్ట్‌ కంపెనీకి చెందిన ఎమ్‌ఎస్‌ఎన్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌లో 27 మంది జర్నలిస్టులను సంస్థ తొలగించనున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలకు ఉద్యోగులను తగ్గించుకునే వెసలుబాటును కృత్రిమ మేధ కల్పిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ నివేదికపై జర్నలిస్టులు స్పందిస్తూ..  కంపెనీ అధికారులు తమ అవసరం లేదని చెబుతున్నారని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చేయాల్సిన విధులను కృత్రిమ మేధ(ఆర్టీఫీషియల్‌ ఇంటలిజన్స్‌) నిర్వహిస్తోందని అధికారులు చెప్పడం సమంజసం కాదని జర్నలిస్టులు వాపోయారు.

కాగా సీటల్‌ టైమ్స్‌ అనే మరో నివేదిక ప్రకారం జూన్‌ చివరి నాటికి 50 మంది జర్నలిస్టులకు మైక్రోసాఫ్ట్ ఉద్వాసన పలకనున్నట్లు పేర్కొంది. కరోనా సంక్షోభం కారణంగానే ఉద్యగులను తొలగిస్తున్నారని మీడియా ప్రశ్నకు కంపెనీ అధి​కారులు స్పందిస్తూ.. ప్రతి సంవత్సరం వ్యాపార వృద్ధిని విశ్లేషిస్తూ ఉద్యోగులను తొలగించడం లేదా అదనంగా నియమించుకోవడం సర్వసాధారణం అని అధికారులు స్పష్టం చేశారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీలు తమ వ్యాపార వృద్ధిని పెంచుకునేందుకు ప్రతి ఏడాది ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారని తెలిపారు.

అయితే  మైక్రోసాఫ్ట్ అమలు చేస్తున్న నిర్ణయాలు మిగతా కంపెనీలు అమలు చేయలేవని నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా స్టోరీల ఎంపిక, ఎడిటోరియల్స్‌ విశ్లేషణ చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా వార్తలను ప్రచురణ చేయడంలో కృత్రిమ మేధను ఉపయోగించడం కొత్తేమి కాదని సాంకేతిక నిపుణులు తెలిపారు.  వార్తలను వేగంగా విశ్లేషించి, టెక్నాలజీని అత్యుత్తమంగా ఉపయోగించేందుకు జర్నలిస్టులకు కృత్రిమ మేధ ఎంతో ఉపయోగకరమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

చదవండి: ఆ కంపెనీలో వారానికి మూడు వీక్లీ ఆఫ్‌లు..


 

మరిన్ని వార్తలు