మైక్రోసాఫ్ట్ నుంచి త్వరలో సర్ఫేస్!

25 Apr, 2016 20:53 IST|Sakshi
మైక్రోసాఫ్ట్ నుంచి త్వరలో సర్ఫేస్!

ఎంతోకాలం నుంచి త్వరలో విడుదల చేస్తామని చెబుతున్న మైక్రోసాఫ్ట్లో తన కొత్త మోడల్ 'సర్ఫేస్'లో ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించారో తెలిసింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో లభ్యం కానుంది. ఇందుకోసం ఎంఎస్ఎం 8998 ఎస్ఓసీ ప్రాసెసర్ను ఆపరేటింగ్ సిస్టంకు తగినట్లుగా సిద్ధం చేసింది. ప్రత్యేకంగా తయారుచేసిన ప్రాసెసర్ను క్వాల్కామ్ త్వరలో మైక్రోసాఫ్ట్కు అందించనున్నట్లు సమాచారం. ఫోర్బ్స్ ప్రచురణ ప్రకారం ఎంఎస్ఎం8998 ప్రాసెసర్ ముందు తరానికి చెందినదిగా, స్నాప్ డ్రాగన్ 830గా పేర్కొంది. శామ్సంగ్ ఫోన్ల తయారీ పద్దతిలో ఉపయోగించే 10ఎన్ఎం తయారీ పద్ధతిని ఇందుకు ఉపయోగించనున్నారు.

8 జీబీ ర్యామ్తో ఉండే ఈ ఫోన్ను మూడు రకాలుగా భిన్నమైన ధరలతో ముందుకు తేనున్నట్లు సమాచారం.  విండోస్ 10 ఓఎస్కు జతచేస్తున్న కొత్త ఫీచర్ల కారణంగా విడుదల సమయం పెరుగుతూ వస్తోంది. కాగా మైక్రోసాఫ్ట్ 2017 వరకు ఈ మొబైల్ను అందుబాటులోకి తేలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు