మైక్రోసాఫ్ట్ పోటీలో విజేతగా హైదరాబాదీ

29 Jun, 2013 07:05 IST|Sakshi
మైక్రోసాఫ్ట్ పోటీలో విజేతగా హైదరాబాదీ

హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సంస్థ నిర్వహించిన కంప్లీట్లీ బాస్ ఛాలెంజ్ పోటీలో హైదరాబాద్‌కు చెందిన గడ్డం రంజిత్ రెడ్డి విజేతగా నిలిచారు. మొత్తం 7 నగరాల్లో 2500 మంది సీఈవోలు పాల్గొన్న ఈ పోటీలో రోహిణి మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రంజిత్ రెడ్డి విజేతగా నిలిచారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈయనతో పాటు అహ్మదాబాద్‌కు చెందిన సార్ట్ ఇండియా ఎన్విరో సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు పరేష్ తులసీదాస్ పరేఖ్, ముంబైకి చెందిన నెప్ట్యూనస్ పవర్ ప్లాంట్ సర్వీసెస్ ఎండీ ఉదయ్ పురోహిత్‌లు కూడా విజేతలుగా నిలిచారని పేర్కొంది.

వీరికి వీరి వ్యాపారానికి సంబంధించి పరిశ్రమల నిపుణులచే రూపొందించిన ఐదేళ్ల వృద్ధి ప్రణాళికలను అందిస్తామని వివరించింది. ఇలాంటి వినూత్నమైన పోటీలో పాల్గొని విజేతగా నిలవడం ఆనందంగా ఉందని గడ్డం రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి పోటీలు చిన్న వ్యాపార సంస్థల పురోగతికి ఎంతగానో తోడ్పడతాయని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇండియా జీఎం(మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇండియా) రామ్‌కుమార్ పిచయ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు