మార్కెట్లు లాభాల్లో- ఈ షేర్లు నష్టాల్లో

20 May, 2020 15:23 IST|Sakshi

సెన్సెక్స్‌ 500 పాయింట్లు అప్‌

9,000 మార్క్‌ను దాటిన నిఫ్టీ

మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌నకు అమ్మకాల సెగ

లాక్‌డవున్‌ అమలవుతున్నప్పటికీ పలు రంగాలలో కార్యకలాపాలు తిరిగి జోరందుకోనుండటంతో స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 513 పాయింట్లు జంప్‌చేసి 30,709ను తాకగా.. నిఫ్టీ 158 పాయింట్లు ఎగసి 9,036 వద్ద ట్రేడవుతోంది. తద్వారా 9,000 పాయిం‍ట్ల మైలురాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, అరవింద్‌ ఫ్యాషన్స్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌, కొఠారీ ప్రొడక్ట్స్‌, జువారీ గ్లోబల్‌ చోటు చేసుకున్నాయి. వివరాలు చూద్దాం..

భారతీ ఇన్‌ఫ్రాటెల్‌: మొబైల్‌ టవర్ల రంగ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 9 శాతం కుప్పకూలి రూ. 200 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3.58 లక్షల షేర్లుకాగా..మధ్యాహ్నానికల్లా  ఈ కౌంటర్లో 5.49 లక్షల షేర్లు చేతులు మారాయి. 

అరవింద్‌ ఫ్యాషన్స్‌: ఈ లైఫ్‌స్టైల్‌ దుస్తుల కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 6.3 శాతం దిగజారి రూ. 113 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 110 వద్ద ఏడాది కనిష్టానికి చేరింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 16,000 షేర్లుకాగా..మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 3900 షేర్లు చేతులు మారాయి. 

కేపీఐటీ టెక్నాలజీస్‌: ఈ ఐటీ సేవల కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 5 శాతం పతనమై రూ. 43 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 9,000 షేర్లుకాగా..మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 9500 షేర్లు చేతులు మారాయి. 

కొఠారి ప్రొడక్ట్స్‌: ఈ స్మాల్‌ క్యాప్‌ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం తిరోగమించి రూ. 40 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం కేవలం 500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్‌లో 6000 షేర్లు చేతులు మారాయి.

జువారీ గ్లోబల్‌: ఈ ప్రయివేట్‌ రంగ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పతనమై రూ. 37 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం కేవలం 3400 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్‌లో 3000 షేర్లు చేతులు మారాయి.

>
మరిన్ని వార్తలు