మార్కెట్ల జోరు- ఈ మిడ్‌ క్యాప్స్‌ బోర్లా

22 Jun, 2020 15:38 IST|Sakshi

ఇంట్రాడేలో 35,000కు సెన్సెక్స్‌

లాభాల సెంచరీ చేసిన నిఫ్టీ

భారీ ట్రేడింగ్‌తో చిన్న షేర్లు డీలా

ఎల్‌ఐసీ హౌసింగ్‌, వక్రంగీ, ఐటీఐ..

చైనాతో సరిహద్దు వివాదం, పెరుగుతున్న కోవిడ్‌-19 కేసుల నేపథ్యంలోనూ దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 35,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 100 పాయింట్లు ఎగసింది. ఈ నేపథ్యంలోనూ కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొటున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా ఎగసింది. జాబితాలో ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, వక్రంగీ లిమిటెడ్‌, ఐటీఐ లిమిటెడ్‌, జెన్సన్‌ టెక్నాలజీస్‌,  ఎల్‌టీ ఫుడ్స్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

ఎల్‌ఐసీ హౌసింగ్‌  
గృహ రుణాల ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 6 శాతం పతనమైంది. అమ్మేవాళ్లు అధికంకావడంతో రూ. 268 వద్ద ట్రేడవుతోంది.  తొలుత రూ. 266 వరకూ జారింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 4.2 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 7.5 లక్షల షేర్లు చేతులు మారాయి.

వక్రంగీ లిమిటెడ్‌
టెక్నాలజీ ఆధారిత సేవల ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 5 శాతం పతనమైంది. అమ్మేవాళ్లు అధికంకావడంతో రూ. 35 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది.  బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3.32 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 2 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఐటీఐ లిమిటెడ్‌
టెలికం రంగ ఈ ప్రభుత్వ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 4.5 శాతం పతనమైంది. అమ్మేవాళ్లు అధికంకావడంతో రూ. 102  వద్ద ట్రేడవుతోంది.  బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2.2 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 1.63 లక్షల షేర్లు చేతులు మారాయి.

జెన్సర్‌ టెక్నాలజీస్‌
సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్ల ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 4 శాతం క్షీణించి రూ. 130 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 30,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 46,000 షేర్లు చేతులు మారాయి.

ఎల్‌టీ ఫుడ్స్‌
బస్మతి బియ్యం ఎగుమతి చేసే ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 8.5  శాతం కుప్పకూలి రూ. 39 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3.87 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 6.67 కోట్ల షేర్లు చేతులు మారాయి.

మరిన్ని వార్తలు