తల్లిదండ్రుల కంటే మెరుగైన జీవనం: సర్వే

13 Jun, 2020 18:01 IST|Sakshi

న్యూఢిల్లీ: పాశ్చాత్య యువత, దేశీయ యువతకు సంబంధించిన అభిరుచులపై మింట్‌(మీడియా సంస్థ), సీపీఆర్‌(సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌) సంయుక్తంగా సర్వే నిర్వహించింది. అమెరికా యువత ఎక్కువ అప్పులు, తక్కువ ఆదాయాలు, తక్కువ ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలిపింది. కాగా భారతీయ యువత మాత్రం తమ తల్లిదండ్రుల కంటే మెరుగైన జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న పదిలో ఎనిమిది మంది భారతీయులు తమ తల్లిదండ్రుల కంటే మెరుగ్గా ఉన్నామని తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో భారతీయ యువతకు అత్యున్నత ఉద్యోగాలు లభించాయని.. అనుబంధాల విషయంలోను తమ తల్లిదండ్రుల కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు.

మింట్-సీపీఆర్‌ మిలీనియల్ సర్వేను ఆన్‌లైన్‌లో 2020, మార్చి12 నుంచి ఏప్రిల్ 2 మధ్య 184 పట్టణాలు, నగరాల్లో నిర్వహించారు. ఈ సర్వేలో  10,005 మంది  పాల్గొన్నారు. వీరిలో 4,957 మంది మిలీనియల్స్(22నుంచి 37సంవత్సరాలు), 2,983 మంది పోస్ట్ మిలీనిలయల్స్‌(1996 సంవత్సరం తరువాత జన్మించిన వారు) 2,065 ప్రీ-మిలీనియల్స్(40సంవత్సరాల వయస్సు పైబడిన వారు) పాల్గొన్నారు. దేశీయ యువత ఎక్కువగా ఇతర నగరాలు, విదేశాలకు వెల్లడానికి మొగ్గు చూపారని సర్వే పేర్కొంది. కాగా, లక్షకుపైగా జీతాన్ని సంపాదిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న మెజారిటీ యువత తెలిపారు. భారతీయ యువత ఎక్కువగా సొంతింటి బదులు అద్ది ఇంటేకే ప్రాధాన్యత ఇస్తున్నారని.. ఆర్థికంగా మెరుగయ్యాకే సొంతింటి కళ గురించి ఆలోచిస్తామని మెజారిటీ యువత పేర్కొన్నారు.(చదవండి: భారత్‌లో మతస్వేచ్ఛ.. ఆందోళనకరం’)

మరిన్ని వార్తలు