1.65 కోట్లకు పెరిగిన మిలియనీర్లు

28 Sep, 2017 13:51 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీః ప్రపంచవ్యా‍ప్తంగా అసమానతలు వేగంగా పెరుగుతుంటే మిలియనీర్ల సంఖ్యా అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మిలియనీర్ల సంఖ్య 8 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 1.65 కోట్లకు చేరుకుందని కన్సల్టెన్సీ సంస్థ క్యాప్‌జెమినీ నివేదిక వెల్లడించింది. 2016లో రూ 5 కోట్లు అంతకుమించి పెట్టుబడులు పెట్టగల అధికాదాయ వ్యక్తుల(హెచ్‌ఎన్‌ఐ) సంఖ్య 8.2 శాతానికి పెరిగిందని, వీరందరి ఉమ్మడి సంపద 2025 నాటికి వంద లక్షల కోట్ల డాలర్లను దాటుతుందని ఆ నివేదిక అంచనా వేసింది.

గత ఏడాది కొత్తగా 15 లక్షల మందికి పైగా మిలియనీర్ల జాబితాలో చేరారని పేర్కొంది. ఈ జాబితాలో మూడింట రెండొంతుల మంది మిలియనీర్లు అమెరికా, జపాన్‌,జర్మనీ,చైనాలకు చెందిన వారేనని నివేదిక తెలిపింది.మిలియనీర్ల ఆస్తుల్లో వారి నివాసాల విలువ, వారు వినియోగించే అత్యంత ఖరీదైన వస్తువుల విలువను లెక్కించలేదని తెలిపింది.

మరిన్ని వార్తలు