ఎంఎంటీసీ నుంచి ‘తుల’ గోల్డ్ కాయిన్

7 May, 2016 00:28 IST|Sakshi
ఎంఎంటీసీ నుంచి ‘తుల’ గోల్డ్ కాయిన్

న్యూఢిల్లీ: అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని పసిడి, వెండి రిఫైనర్- మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాంప్ (ఎంఎంటీసీపాంప్) ‘తుల’ పేరుతో 11.6639 గ్రాముల పసిడి నాణేన్ని విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల నాణేలను ముద్రించనున్నట్లు ప్రకటించింది. 999.9 ప్యూర్ గోల్డ్‌తో దీనిని సంస్థ తయారు చేసింది.

త్రాసుతోపాటు భారత పురాతన సంప్రదాయాలు ప్రతిబింబించేలా నాణేన్ని రూపొందించినట్లు ఎంఎంటీసీ పాంప్ మేనేజింగ్ డెరైక్టర్ రాజేశ్ ఖోస్ల తెలిపారు. ‘తుల’ కాయిన్ తొలుత ఎంఎంటీసీపీ ఔట్‌లెట్స్‌లో, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు, అలాగే ప్రముఖ ఆభరణాల షాపుల్లో లభ్యమవుతుందని పేర్కొన్నారు. ఎంఎంటీసీ, స్విట్జర్లాండ్ పీఏఎంపీ సంయుక్త భాగస్వామ్యంతో ఎంఎంటీసీ పాంప్ ఏర్పాటయ్యింది.

మరిన్ని వార్తలు